కవిత అరెస్ట్ కాకూడదు .. కేటీఆర్ సీఎం కావాలి, కేసీఆర్ లక్ష్యం ఇదే : అమిత్ షా వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్ లక్ష్యం కూతురును జైలుకెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును సీఎం చేయడమని అమిత్ షా ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్‌లో జరిగిన మేధావుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్ తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లక్ష్యం కూతురును జైలుకెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును సీఎం చేయడమని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్‌ను ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ అని అమిత్ షా తెలిపారు. 2014కు ముందు దేశంలో అశాంతి వుండేదని , మోడీపై అవినీతి ఆరోపణలు లేవని ఆయన వెల్లడించారు. 2014కు ముందు దేశంలో అశాంతి వుండేదని.. ఇప్పుడు భారత్‌కు విదేశాల్లో గౌరవం పెరిగిందని, దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యిందని అమిత్ షా పేర్కొన్నారు. మూడు పార్టీల్లో ఎవరిని ఎన్నుకోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ALso Read: తెలంగాణలో బీజేపీదే అధికారం: ఆదిలాబాద్ సభలో అమిత్ షా
మోడీ నాయకత్వంలో భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని.. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచంలోనే మనదేశం కీలకపాత్ర పోషిస్తుందని అమిత్ షా ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వుండవని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో వుందని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ హయాంలో 12 కోట్ల మందికి ఇళ్లు ఇచ్చామని.. 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. మోడీ నేతృత్వంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అమిత్ షా గుర్తుచేశారు.