తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. పోలీసు నియామక ప్రక్రియలో వయో పరిమితిపెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీజేపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. పోలీసు నియామక ప్రక్రియలో వయో పరిమితిపెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీజేపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆందోళనకు దిగిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నిరుద్యోగులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇక, తెలంగాణ సర్కార్ ఇటీవల 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీన ప్రారంభం కాగా.. మే 20వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఎస్సై పోస్టుల వయోపరిమితి విషయానికి వస్తే.. 2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అదే సమయంలో 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 1997 జులై 2 కంటే ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. అయితే గరిష్ఠ వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపునిచ్చారు. విద్యార్హత విషయాని వస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
కానిస్టేబుల్ పోస్టుల వయోపరిమితి విషయానికి వస్తే.. 2022 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అదే సమయంలో 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 2000 జులై 2 కంటే ముందు... 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. మహిళా కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్), మహిళా వార్డర్లకు మాత్రం మినహాయింపులు ఉన్నాయి. ఇచ్చారు. వితంతువులు, భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ వివాహం చేసుకోని.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18 ఏళ్లు నిండి - గరిష్ఠంగా 40 ఏళ్లు మించకూడదు. ఇతర అన్ని కులాల్లో 18-35 మధ్య వయసు గలవారు అర్హులుగా పర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల విద్యార్హత విషయానికి వస్తే.. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అయితే పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో గరిష్ట వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులను డిమాండ్ చేస్తున్నారు.
