ట్రాన్స్ జెండర్ ను ఇష్టపడి పెళ్ళిచేసుకున్న యువకుడు చివరకు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ లో వెలుగుచూసింది. 

మహబూబాబాద్ : ట్రాన్స్ జెండర్ కోడలు వేధింపులవల్లే తన కొడుకు చనిపోయాడని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మాయమాటలతో తన కొడుకును లోబర్చుకున్న ట్రాన్స్ జెండర్ చివరకు ఆత్మహత్యకు కారణమయ్యిందని అన్నారు. గతంలో ఓ ట్రాన్స్ జెండర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుని వార్తల్లో నిలిచిన మహబూబాబాద్ యువకుడు తాజాగా సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన ధరావత్ శివరాం ట్రాన్స్ జెండర్ ప్రవీణ్ అలియాస్ తపస్విని ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. ట్రాన్స్ జెండర్ తో శివరాం ప్రేమ... పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే ట్రాన్స్ జెండర్ భార్యతో కలిసి బ్రతకలేకపోయిన శివరాం దూరంగా వుండసాగాడు. ఇలా ఇద్దరి మద్య మనస్పర్దలు రావడంతో విడిపోయి ఎవరి జీవితం వారు బ్రతుకున్నారు. 

అయితే ఇటీవల శివరాంకు మరో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావించారు. కానీ అతడి పెళ్లి జరక్కుండా ట్రాన్స్ జెండర్ తపస్వి అడ్డుకుంటోంది. దీంతో ఇక తనకు పెళ్లికాదేమోనని బాధపడుతూ శివరాం దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Read More హైద్రాబాద్ మీర్‌పేట నందనవనంలో బాలికపై గ్యాంగ్ రేప్: బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన...అరెస్ట్

తన కొడుకు ఆత్మహత్యకు ట్రాన్స్ జెండర్ కోడలు తపస్వి కారణమని శివరాం తల్లి ఆరోపిస్తోంది. పెళ్లి కానివ్వకుండా తపస్వి అడ్డుకోవడం వల్లే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదును స్వీకరించిన పోలీసులు శివరాం ఆత్మహత్యపై దర్యాప్తు చేపట్టారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)