హైద్రాబాద్ మీర్‌పేట నందనవనంలో బాలికపై గ్యాంగ్ రేప్: బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన...అరెస్ట్
మీర్ పేట బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని నందనవనంలో ఆందోళన నిర్వహించారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు.
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేటలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మీర్ పేట నందనవనంలో స్థానికులు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతు ప్రకటించాయి. ఈ ఆందోళన కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పెద్ద అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మీర్‌పేట నందనవనంలో మైనర్ బాలికపై ఎనిమిది మంది ఇంట్లోకి దూరి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి బాలికపై అత్యాచారం చేశారు. తమ్ముడి ముందే ఆమెపై అత్యాచారం చేశారు. ఉదయం పూటే ఈ ఘటన జరిగింది. ఇంట్లోకి వచ్చి బెదిరించి బాధితురాలిపై అత్యాచారం చేశారు. బాధితురాలు తమ సోదరులతో కలిసి నందనవనంలో ఉంటుంది. బాధితురాలి తల్లి ఇటీవలనే ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తండ్రి మరో వివాహం చేసుకోవడంతో తల్లి సూసైడ్ చేసుకుంది. దీంతో సోదరులతో కలిసి బాధితురాలు నందనవనంలో ఉంటుంది.ఈ విషయాన్ని గమనించిన గంజాయి బ్యాచ్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.