రేవంత్ రెడ్డి జీవితం అనూహ్య మలుపులు తిరిగిన రోజులివే

అక్టోబరు 2 నుంచి నవంబరు 2 వరకు... రేవంత్ రెడ్డి నోటికి ఇరామ్ లేదు. ప్రతిరోజు మాట్లాడి మాట్లాడి లాస్టుకు ఆయన గొంతు బొగురు పోయింది. అంతేకాదు ఈ రెండు తేదీలు రేవంత్ జీవితంంలో కీలక మలుపు తిప్పిన రోజులుగా చెబుతున్నారు. మరి రేవంత్ లైఫ్ లో ఆ రెండు తేదీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

రాజకీయ నాయకులు ఎప్పుడు జనాల్లో ఉండాలి. వార్తల్లో ఉండాలి. పాజిటీవ్ గా అయినా, నెగిటీవ్ గా అయినా... ఎలాగైనా సరే చర్చల్లో నానుతూ ఉండాలి. అలా అయితేనే రాజకీయాల్లో మనుగడ సాధిస్తారు. ఈ సూత్రాన్ని సరిగ్గా వంటపట్టించుకున్నారు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే గత దశాబ్ధ కాలంగా రేవంత్ అయితే పాజిటీవ్, కుదరకపోతే నెగిటీవ్ ఏ రోల్ అయినా సరే జనాల్లో, వార్తల్లో, చర్చల్లో నిత్యం ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆమేరకు ఫలితాలు కూడా సాధిస్తున్నారు.

మరి అక్టోబరు 2, నవంబరు 2 ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. నవంబరు 2వ తేదీ మధ్యాహ్న సమయంలో తెలంగాణ సిఎం కేసిఆర్ అనంతపురం జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యారు. ఛలో అప్పటి నుంచి రేవంత్ శిబిరంలో కల్లోలం నెలకొంది. ఆ రోజు కేసిఆర్ చేసిన ఆ పర్యటన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పిడుగు లాంటి వార్తను అందించింది. అప్పటినుంచి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడేందుకు పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి.

ఇక నవంబరు 2 గురించి కూడా చూద్దాం. అక్టోబరు 2 నుంచి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు. అనుక్షణం రేవంత్ ఏం చేస్తున్నాడా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా ఆసక్తి ఉండేది. ఆ జోరు రేవంత్ ఢిల్లీ వెళ్లి రాహుల్ తో భేటీ అయిన తర్వాత మరింత పెరిగింది. అయితే నవంబరు 2న రేవంత్ సరికొత్త పంథా మొదలు పెట్టారు. అంతకుముందురోజు తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటిఆర్ రేవంత్ పై తిట్ల వర్షం కురిపించారు. దీంతో దానిపై రేవంత్ కౌంటర్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కొత్త రూట్ లో కేటిఆర్ విమర్శలకు ట్విట్టర్ లోనే సమాధానం చెప్పాడు. పైగా కేటిఆర్ కు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ ఘాటైన చురకలు కూడా వేశారు. సో నవంబరు 2 అనేది రేవంత్ జీవితంలో కొత్త పంథాలో నడిపించిందని చెప్పవచ్చు.

నెలరోజులపాటు విశ్రమించని రేవంత్ ఇప్పుడు రిలాక్ష్ అయిండు. ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత ట్విట్ ద్వారా మాత్రమే జనం ముందుకొచ్చిండు తప్ప ప్రత్యక్షంగా రాలేదు.

మరిన్ని తాజా వార్తలతోపాటు, తెలంగాణ జర్నలిస్టులకు

కేసిఆర్ సర్కారు శుభవార్త వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/8G75kg