హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంబిస్తోంది. ముఖ్క్ష్యంగా రాజధాని హైదరాబాద్ లో ఈ  వైరస్ ఉదృతి మరీ ఎక్కువగా వుంది. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో మరో ఇద్దరు ఎస్సైలకు కరోనా పాజిటివ్ గా తేలింది. వీరితో కలిపి ఇప్పటివరకు ఈ స్టేషన్లో మొత్తం 33మంది కరోనా బారిన పడ్డారు. 

తాజాగా కరోనా నిర్దారణ అయిన ఇద్దరు ఎస్సైలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మిగతా పోలీస్ సిబ్బంది కూడా ప్రస్తుతం   వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. 

read more   వైద్యం నిరాకరణ, కళ్ల ముందే తల్లిమరణంతో తల్లడిల్లిన కూతురు

మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 1,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది.

నిన్న వైరస్‌ కారణంగా 9 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 447కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 39,327 మంది డిశ్చార్జ్ అయ్యారు.

హైదరాబాద్‌లో ఈ ఒక్కరోజు 662 కేసులు నమోదవ్వగా... రంగారెడ్డి 213, మేడ్చల్ 33, వరంగల్ అర్బన్ 75, సిరిసిల్ల 62, మహబూబ్‌నగర్ 61, నల్గొండ 44, సూర్యాపేట 39, కరీంనగర్ 38, నిజామాబాద్ 38, సంగారెడ్డి 32, భూపాలపల్లి 25, వరంగల్ రూరల్ 22, జనగాం 22, మహబూబాబాద్ 18, ఆదిలాబాద్ 17, ములుగు 17, జగిత్యాల 14, సిద్ధిపేట 9, వికారాబాద్ 5, ఆసిఫాబాద్ 4, పెద్దపల్లి, భద్రాద్రి, గద్వాలలో రెండేసి కేసులు, మంచిర్యాల, నిర్మల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.