కరోనాతో కల్లోలం: జగిత్యాలలో రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకు మృతి
జగిత్యాల పట్టణంలో కరోనాతో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించారు. ఇదే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ పట్టణంలో రామచంద్రం అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో కరోనాతో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించారు. ఇదే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ పట్టణంలో రామచంద్రం అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆయన వయస్సు 55 ఏళ్లు. వారం రోజుల క్రితం రామచంద్రం కరోనాతో మరణించాడు.
ఈ కుటుంబంలో రామచంద్రంతో పాటు ఆరుగురు కరోనాబారినపడ్డారు. ఐదు రోజుల క్రితం రామచంద్రం పెద్ద కొడుకు సునీల్ కరోనాతో మరణించాడు. సునీల్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ వార్డు కౌన్సిలర్ మల్లవ్వ, ఆమె భర్త పీపీఈ కిట్స్ వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు.
also read:ఏదైనా రాత్రి 8 కి క్లోజ్ చేయాల్సిందే.. అత్యవసరమైతేనే బయటకు రండి: సీపీ మహేశ్ భగవత్
రామచంద్రం అంత్యక్రియలను కూడ మున్సిపల్ సిబ్బందే నిర్వహించారు. కరోనాతో మరణించిన సునీల్ భార్య, ఇద్దరు పిల్లలు కూడ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే కరోనా కేసులు 6 వేలకు చేరుకొన్నాయి. దీంతో ఇవాళ రాత్రి నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నైట్ కర్ఫ్యూతో వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.