బైక్ మీద మెరుపు వేగంతో వెళ్లడంతో ఈ ఇద్దరు యువతీ యువకులు బలయ్యారు. సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ శివారులోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వైష్ణవి, లోకేష్ లు వేగంగా బైక్ మీద వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కళాశాలలో సెలబ్రేషన్స్ ఉన్న కారణంగా తొందరగా కాలేజీకి వెళ్లే ప్రయత్నంలో వీరు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. చనిపోయిన అమ్మాయి వైష్ణవి డ్యాన్స్ షో ఈరోజు కాలేజీ వేడుకల్లో భాగంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.