హైదరాబాద్: టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న దేవరాజు రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలకమైన విషయాలను వారు రాబట్టినట్లు తెలుస్తోంది.

శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ ప్రధాన కారకుడని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. దేవరాజ్ ను ప్లే బాయ్ గా పోలీసులు గుర్తించారు. అతను ఒకరికి తెలియకుండా మరొకరితో పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్లు వారు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: మరో మలుపు: శ్రావణి, ఆర్ఎక్స్100 సినీ నిర్మాత ఫోన్ సంభాషణ లీక్

టిక్ టాక్ వీడియోల ద్వారా ఆ విషయాలను పోలీసులు రాబట్టారు. శ్రావణితో ప్రేమాయణం సాగిస్తూనే మరో నలుగురు అమ్మాయిలతో అతను సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని టీవీ న్యూస్ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. శ్రావణిని ప్రేమ పేరుతో దేవరాజ్ ఉచ్చులోకి లాగినట్లు భావిస్తున్నారు. 

తనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు దేవరాజ్ మొబైల్ ఉండడంతో శ్రావణి భయపడినట్లు భావిస్తున్నారు. టీవీ పరిశ్రమలో నిలదొక్కుకుని స్థిరపడి, అవకాశాలు వస్తున్న సమయంలో దేవరాజ్ వాటిని భయపడితే తన వృత్తికి ప్రమాదం వాటిల్లుతుందని ఆమె భయపడినట్లు చెబుతున్నారు. దేవరాజ్ ప్రవేశించిన తర్వాతనే శ్రావణికి కష్టాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఈ స్థితిలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పరిణామాలు కేసులో కీలకం కానున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: సీరియల్ నటి శ్రావణి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్: దేవరాజ్ రెడ్డి, శ్రావణి మధ్య గొడవ ఆడియో లీక్

మరో ఇద్దరు అమ్మాయిలతో కూడా దేవరాజ్ గొడవ పడినట్లు తెలుస్తోంది. మౌనరాగం, మనసు మమత సీరియల్స్ ద్వారా శ్రావణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వేధింపుల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో దేవరాజ్ గురువారంనాడు ఎస్సార్ నగర్ పోలీసుల ముందు విచారణ నిమిత్తం హాజరయ్యాడు. కాకినాడ నుంచి అతను హైదరాబాదు వచ్చి పోలీసుల ముందుకు వచ్చాడు.