హైదరాబాద్: మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజురెడ్డి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆడియో సంభాషణ వెలుగు చూసింది. శ్రావణికి, ఆర్ఎక్స్ సినిమా నిర్మాత అశోక్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీకైంది. 

ప్రముఖ మీడియా సంస్థ సాక్షి ఈ ఆడియో సంభాషణను ప్రసారం చేసింది. ఈ సంభాషణ ప్రకారం.. దేవరాజురెడ్డి వేధింపుల గురించి శ్రావణికి, అశోక్ రెడ్డికి మధ్య సంభాషణ సాగినట్లు అర్థమవుతోంది. రాజీకి రావాలని దేవరాజు రెడ్డి అడగడంపై ఆ సంభాషణ సాగింది. రాజీకి తాను సిద్ధమేనని, అయితే పోలీసుల నుంచి ఫోన్ వస్తే తాను వస్తానని చెప్పానని శ్రావణి అశోక్ రెడ్డితో అన్నట్లు ఫోన్ సంభాషణల ద్వారా తెలుస్తోంది.

Also Read: సీరియల్ నటి శ్రావణి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్: దేవరాజ్ రెడ్డి, శ్రావణి మధ్య గొడవ ఆడియో లీక్

దేవరాజు మీద శ్రావణి కేసు పెట్టిన నేపథ్యంలో ఆ సంభాషణ సాగింది. టిక్ టాక్ లో అమ్మాయిలను ఫ్రెండ్స్ చేసుకునేవాడని, వారితో స్నేహం పెంచుకుని డబ్బులు వసూలు చేసేవాడని శ్రావణి గతంలో హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలావుంటే, దేవరాజు రెడ్డి గురువారం ఉదయం ఎస్సార్ నగర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రావణి ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని దేవరాజు చెప్పిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అతను అన్నాడు. దేవరాజు ఆరోపణలను సాయి ఖండించాడు కూడా.

Also Read: మౌనరాగం నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్: తెర మీదికి మరో వ్యక్తి