హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. శ్రావణిని కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేయడంతో మనోవేదనకు గురైందని దేవరాజ్ రెడ్డి చెప్పారు. 

ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు.ఈ వీడియో సందేశం పంపిన కొద్ది గంటల్లోనే దేవరాజ్ రెడ్డికి శ్రావణికి మధ్య జరిగిన ఆడియో సంభాషణ మరొకటి బయటకు వచ్చింది. ఈ ఆడియోలో  నటి శ్రావణిని దేవరాజ్ రెడ్డి బెదిరించాడు. ఈ సంభాషణను ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.

తన ముఖం చూడడానికి చిరాకుగా ఉందా...అంటూ శ్రావణిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు దేవరాజ్ రెడ్డి.మర్యాదగా వచ్చి గంట గడపాలని దేవరాజ్ శ్రావణిని ఫోన్ లో బెదిరించాడు.  నీకు విశ్వాసం లేదు, నాతో ఆడుకోకు అంటూ దేవరాజ్ తో ఫోన్ లో శ్రావణి ప్రాధేయపడింది. 

తన వద్దకు రాకపోతే ఏం జరుగుతోందో నీకు తెలియదంటూ దేవరాజ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు. నీతో మాట్లాడను.. సారీ అంటూ దేవరాజ్ ను శ్రావణి కోరింది. నీవు ఇంత సీరియస్ గా తీసుకొంటావని తాను అనుకోలేదని దేవరాజ్ రెడ్డితో శ్రావణి చెప్పింది.

బజారున పడుతావా... నాతో వచ్చి మాట్లాడుతావా... అని దేవరాజ్ రెడ్డి అన్నారు.దేవా...నన్ను వదిలేయ్.. అంటూ దేవరాజ్ ను ఆమె పదే పదే ప్రాధేయపడింది.  తన సోదరుడే తనను తిడుతున్నాడని ఆమె చెప్పింది.