హైదరాబాద్: మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు చిక్కుముళ్లు వీడడం లేదు. ముగ్గురు పురుషుల మధ్య శ్రావణి చిక్కుకుని విలవిలలాడినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు దేవరాజ్ రెడ్డిని ఇంకా విచారిస్తున్నారు. గురువారం నుంచి అతను ఇప్పటి దాకా అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. అతని చెప్పిన విషయాలను ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

దేవరాజ్, శ్రావణి కలిసి హోటల్లో భోజనం చేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజుతో శ్రావణి సన్నిహితంగా ఉన్టన్లు దాని ద్వారా పోలీసుుల ధ్రువీకరించుకున్నారు తామిద్దరం భోజనం చేస్తున్న సమయంలో సాయి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాడని, శ్రావణిని నడిరోడ్డు మీద జట్టుపట్టుకుని కొట్టాడని దేవరాజ్ చెప్పిన విషం తెలిసిందే.

Also Read: శ్రావణిని ప్రేమ ఉచ్చులోకి లాగిన దేవరాజ్: మరో నలుగురితో ప్రేమాయణం

దేవరాజ్ తో శ్రావణి సన్నిహితంగా ఉందని అదే రోజు సాయి కుటుంబ సభ్యులతో చెప్పాడని, దాంతో శ్రావణితో వారు మాట్లాడారని, అదే రోజు అర్థరాత్రి శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. సాయిని శుక్రవారం విచారించే అవకాశం ఉంది. సాయిని విచారిస్తే కీలకమైన విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 

శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్తగా ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. అశోక్ రెడ్డిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. శ్రావణికి ఎందుకు సలహాలు ఇవ్వాల్సి వచ్చిందని పోలీసులు అశోక్ రెడ్డిని అడిగే అవకాశం ఉంది. 

Also Read: మరో మలుపు: శ్రావణి, ఆర్ఎక్స్100 సినీ నిర్మాత ఫోన్ సంభాషణ లీక్

కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వేధింపుల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో దేవరాజ్ గురువారంనాడు ఎస్సార్ నగర్ పోలీసుల ముందు విచారణ నిమిత్తం హాజరయ్యాడు. కాకినాడ నుంచి అతను హైదరాబాదు వచ్చి పోలీసుల ముందుకు వచ్చాడు.