Asianet News TeluguAsianet News Telugu

న‌గ‌ర‌వాసుల‌కు TSRTC గుడ్ న్యూస్.. 31న రాత్రి Special Buses

TSRTC Special Buses:  కొత్త సంవత్సర వేడుకలకు అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్టు TSRTC ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారికోసం ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ.. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడపనున్నారు. నిర్దేశిత ప్రాంతాల‌కు రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నడపనున్నారు.. తిరుగు ప్రయాణం కోసం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనుంది టీఎస్‌ఆర్టీసీ.

TSRTC Run Special Buses On December 31st Night Time In Hyderabad
Author
Hyderabad, First Published Dec 30, 2021, 9:55 PM IST

TSRTC Special Buses:   నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుకలకు తెలంగాణ‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 31న అర్ధరాత్రి వరకు వైన్సులు, బార్లకు న‌డిపించేలా అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం.   అయితే.. హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వేడుకలు ఘనంగా జరగనున్న నేపథ్యంలో నగరవాసుల కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.
 
డిసెంబ‌ర్ 31 న హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో జరగనున్న న్యూ ఇయర్ వేడుకల్లో, ఈవెంట్స్‌లో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చేందుకు నగరవాసుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడ‌ప‌నున్నారు. అర్ధరాత్రి వేళ.. సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు  ఈ బ‌స్సుల‌ను  వినియోగించుకోవాలని కోరారు. 

READ ALSO:Movie Ticket prices issue: ఏపీ ప్రభుత్వంతో చర్చల దిశగా సినీ ప్రముఖులు.. ప్రభుత్వ పెద్దలతో భేటీ జరిగేనా..?

గురువారం రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్దేశించిన రూట్లలో బస్సులు నడిచి ప్రయాణికులను చేరవేస్తాయని, తిరుగు ప్రయాణం కోసం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సులు నడుస్తాయని సజ్జనార్ వెల్లడించారు. ఒక్కరికి 100 రూపాయల చార్జ్‌ చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. 18 సీట్లు కలిగిన ఏసీ బస్సులో ప్రత్యేకంగా వెళ్లి రావడానికి రూ.4,000తో స్పెషల్‌ ప్యాకేజ్‌ ప్రకటించింది. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

READ ALSO: ఆర్టీసీ బస్సుల్లో ప్రసవాలు.. లైఫ్‌లాంగ్ ఫ్రీ పాస్...!!

ఆర్టీసీ నిర్ణయంపై మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వం, పోలీసులు పెడుతున్న ఆంక్షలు మందు బాబులకు సమస్యగా మారింది. ఈ సమయంలో వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఎంతగానో ఉపయోగపడుతోంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అర్థ‌రాత్రి పూట‌ క్యాబ్‌లు, ట్యాక్సీలు అందుబాటులో ఉండవని, క్యాబ్ బుక్ అయినా.. ఆ సమయంలో ఎక్కువ చార్జీలుంటాయని అభిప్రాయపడుతోన్న వేళ‌..  ఎంతో ఉపయోగకరమని సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios