Asianet News TeluguAsianet News Telugu

వెంటనే ఆపండి.. రాపిడోకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హై కోర్టు రాపిడో సంస్థకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది కోర్టు. అలాగే యూ ట్యూబ్‌ లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించింది. 
 

Win for TSRTC: Nampally Court directs Rapido, YouTube to pull down Ad defaming TSRTC
Author
Hyderabad, First Published Dec 5, 2021, 3:22 PM IST

Telangana High Court: ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ రాపిడోకు తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని వేంట‌నే  నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది. అలాగే.. యూ ట్యూబ్ లోని వీడియోలను కూడా వెంట‌నే తొలిగించాల‌ని ఆదేశించింది కోర్టు. ఆదేశాలను ఉల్లంఘిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.
   
ఇటీవలీ ప్ర‌ముఖ బైక్ ట్యాక్సీ సంస్థ రాపిడో ఓ యాడ్ ను రూపొందించింది. ఈ యాడ్ లో హీరో అల్లు అర్జున్ న‌టించారు. ఇందులో ఆర్టీసీని కించ‌ప‌రిచేలా కొన్ని స‌న్నీవేశాలు చిత్రీక‌రించారు. దీంతో ఆర్టీసీ యాజ‌మాన్యం ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.  హీరో అల్లు అర్జున్‌, రాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగ‌ల్ నోటీసులు జారీచేశారు. దీంతో ఆ యాడ్ నుంచి టీఎస్ఆర్‌టీసీ బస్సులను చూపించిన క్లిప్‌ను తొలగించింది. 
   
ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను హేళ‌న చేస్తూ రూపొందించారు. సాధారణంగా దోసె వేయ‌డానికి ఎంత ఎక్కువ స‌మ‌యం ప‌డుతుందో .. ఆర్టీసీ బస్సు రావ‌డానికి కూడా అంతే స‌మ‌యం ప‌డుతుందనీ. పైగా ఆ బ‌స్సులో కుదుపు, ఎక్కువ జ‌నం ఉంటార‌నీ, ప్ర‌యాణీకులు మ‌సాల దోశ కావాల్సిందేన‌నీ.. అదే రాపిడో అయితే.. చాలా వేగంగా, సురక్షితంగా మ‌న గమ్యానికి చేరుకోవ‌చ్చున‌నీ అల్లు అర్జున్ చెప్తాడు. ఇలా ఆయ‌న‌ ప్రజలకు చెప్పడం సరికాదని ఆర్టీసీ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అల్లు అర్జున్ రాపిడోపై లీగ‌ల్ నోటీసులు జారీచేసింది ఆర్టీసీ. అయితే.. ఈ కేసును విచారించిన తెలంగాణ హై కోర్టు రాపిడో సంస్థ రూపొందించిన ప్రకటల్ని వెంట‌నే తొలగించాలని ఆదేశించింది. మరి కోర్టు ఆదేశాలపై రాపిడో సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Read Also: https://telugu.asianetnews.com/telangana/telangana-rtc-md-sajjanar-has-issued-key-order-in-view-of-corona-micron-variant-r3mw55

ఇలాంటి వివాదాల్లో ఇర్కొవ‌డం సినీ తార‌ల‌కు కొత్తేమి కాదు. డబ్బులిస్తే చాలు వారు ..ఎలాంటి యాడ్స్ లోనై న‌టిస్తారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. వ్యాపార‌ ప్రకటనలకు ఎక్కువగా ఎండార్స్ చేసే నటులపై ఇలాంటి విమర్శలు చాలానే ఉన్నాయి.  గ‌తంలో మహేష్ బాబు ఇలాంటి వివాదంలో ఇరుకున్న విష‌యం తెలిసిందే. మహేష్ బాబు, బాలీవుడ్ యాక్టర్ టైగర్ పాన్ బహార్ అనే మౌత్ ఫ్రెష్‌నర్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్‌ను లగ్జరీగా చిత్రీకరించారు. ఆ పాన్ బహర్‌ మౌత్ ఫ్రెష్‌నర్‌ను తినడాన్ని హీరోయిజంగా ఎలివేట్ చేసారు. ఈ యాడ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ.. నెట్టింట్లో పెద్ద ఎత్తున విమ‌ర్శలు వెల్లువెత్తాయి. వెంట‌నే ఆ యాడ్ ను తొలిగించాల‌ని, ఆ ఉత్ప‌త్తులు ప్ర‌జ‌ల ఆరోగ్యానికి హ‌నీక‌ర‌మ‌ని విమ‌ర్శించారు. 

Read Also:https://telugu.asianetnews.com/telangana/omicron-we-will-ready-to-face-anything-says-telangana-health-director-srinivasa-rao-r3mxkr

గ‌తంలో అమీర్ ఖాన్ కూడా ఓ వివాదాస్ప‌ద యాడ్ లో న‌టించి.. విమ‌ర్శల పాల‌య్యారు. టైర్ల కంపెనీ సియెట్ రూపొందించిన ప్రకటనలోఅమీర్ ఖాన్ న‌టించి.. విమ‌ర్శ‌లెదుర్కున్నారు. ఈ యాడ్ లో రోడ్లపై ట‌పాసులు కాల్చవద్దంటూ ప్రజలను కోరుతాడు అమీర్ ఖాన్. కానీ ఆ యాడ్  హిందువుల మ‌నో భావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయని విమ‌ర్శించారు. ఇలా మంది న‌టీన‌టులు ఇలాంటి వివాద‌స్ప‌ద  యాడ్స్ న‌టించి ఇబ్బందుల పాలయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios