Asianet News TeluguAsianet News Telugu

మాస్క్ ఉంటేనే బస్సులోకి .. TSRTC ఎండీ సజ్జనార్ కీలక ఉత్తర్వులు

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ రోజు రోజుకు పెరుగుతున్న త‌రుణంలో తెలంగాణ ఆర్టీసీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. సరైన మాస్కు ఉంటేనే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించాలని ఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సుల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. 
 

telangana rtc md sajjanar has issued key order in view of corona micron variant
Author
Hyderabad, First Published Dec 5, 2021, 2:11 PM IST

TSRTC New Rules: ప్రపంచ దేశాల‌ను హడలెత్తిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన కొత్త వేరియంట్ శ‌ర‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్  38 దేశాల్లో వ్యాపించి పోయింది. ఈ క్ర‌మంలో భారత్ లో కూడా అడుగుపెట్టింది. ఇప్ప‌డూ మ‌నదేశంలో  త‌న పంజా విసురుతోంది. ప్ర‌జ‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 
 
వైర‌స్ వ్యాప్తి వేగ‌వంతంగా ఉంది. అస‌లు వైర‌స్ లక్షణాలు చాలా తేడా గా ఉన్నాయి. తొలుత ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. బాధిత శ‌రీరంలో వైర‌స్ అభివృద్ది చెందిన త‌రువాత ల‌క్షణాలు బయటపడుతున్నాయ‌ని వైద్యులు అభిప్రాయం వ్యక్తమవుతోంది.  వేరియంట్ వ్యాప్తి త‌గ్గించుకోవ‌డానికి కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా టీకాలు వేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/road-accident-at-jagitial-district-r3mvvv

దీంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వేరియంట్ నివార‌ణ‌కు పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. డెల్టా వైర‌స్ కంటే ఈ వైర‌స్ వ్యాప్తి వేగ‌వంతంగా ఉండ‌టంతో  వ్యాక్సినేష‌న్ ను వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వాలు భావిస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ స‌ర్కార్ మాస్క్‌ల వినియోగం పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విధిత‌మే. ముఖ్యంగా ఎవ‌రైనా మాస్క్ లేకుండా బ‌య‌ట తిరిగిన‌ట్ట‌యితే వారికి రూ.1000 వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఈ క్ర‌మంలో తెలంగాణ ఆర్టీసీ కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ముందస్తు చర్యల్లో అమ‌లు చేయ‌డంలో నిమగ్నమైంది. ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఉత్త‌ర్వుల‌ను జారీ చేసారు. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం..  బస్సులో ప్రయాణించే పాసింజర్లకు మాస్క్ తప్పని సరి చేశారు. మాస్స్ ఉంటేనే బస్సులోకి అనుమతించాలి.  కండక్టర్ తో పాటు డ్రైవర్ కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలి. అలాగే..  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా.. అన్నిబస్సులను శానిటైజ్ చేయాల‌ని, ప్ర‌తిరోజు.. డిపో నుండి బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌తి స‌బ్బును శానిటైజ్ చేయాలని, ఆ బ‌స్సుల్లో  శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/15-people-injured-road-accident-at-karimnagar-district-r3mpky

కరోనా కొత్త వేరియంట్ పై అవ‌గాహాన క‌లిగించేలా..అన్నిబస్టాండ్ లలో అనౌన్స్ మెంట్ చేయాల‌ని, ప్రయాణీకుల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బస్టాండ్‌లలోని రెస్ట్ రూంలలో సబ్బులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. వైర‌స్  వ్యాప్తిని అరికడుతూ.. ఆర్టీసీ ప్రగతికి తోడ్పాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు.

మాజీ పోలీసు బాస్ స‌జ్జ‌నార్..  తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి త‌న మార్క్ చూపిస్తునే ఉన్నారు. ఏదో ఒక‌టి వినూత్న కార్య‌క్ర‌మం చేప‌డుతూనే ఉన్నారు. ఏలాగైనా ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల బాట‌లో ప్ర‌యాణించే య‌త్నిస్తున్నారు. కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అదేవిధంగా తాజాగా పెళ్లిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను బుక్ చేసుకున్న‌వారికి స్పెష‌ల్ గిప్టులు ఇవ్వాల‌ని నూత‌న కార్య‌క్ర‌మాన్ని తీసుకొచ్చారు. ప్ర‌యాణికులను క‌రోనా నుంచి ర‌క్షించ‌డం కోసం ఇప్పుడు నూత‌నంగా మాస్క్ ధ‌రించాలి అనే ఈ రూల్ తీసుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios