Asianet News TeluguAsianet News Telugu

Movie Ticket prices issue: ఏపీ ప్రభుత్వంతో చర్చల దిశగా సినీ ప్రముఖులు.. ప్రభుత్వ పెద్దలతో భేటీ జరిగేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై (ap movie ticket price issue) నెల‌కొన్న వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పెద్దలను కలిసేందకు సినీ పరిశ్రమ ప్రముఖులు (tollywood celebrities) ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో తెరవెనక మంతనాలు కూడా సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

tollywood Celebrities plans to discuss the movie ticket prices issue with ap government
Author
Vijayawada, First Published Dec 27, 2021, 4:32 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై వివాదం (ap movie ticket price issue) నెల‌కొన్న సంగతి తెలిసింది. సినిమా రేట్లను తగ్గిసూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్‌ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి పవన్ కల్యాణ్, నాని వంటి ఒకరిద్దరు బహిరంగంగా మాట్లాడిన వారికి మద్దతు కరువైందనే చెప్పాలి. మరోవైపు సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడేవారిపై ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాము ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మంత్రులు చెబుతున్నారు. సినిమా టికెట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గేదే లేదని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే నిబంధనలు పాటించని థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు తక్కువ రేట్లకు టికెట్లను విక్రయించి.. బిజినెస్ చేయలేమని మరికొందరు థియేటర్ల యాజమానులు స్వచ్చందంగా మూసివేస్తున్నారు. ఇలా ఏపీలో దాదాపు 175 వరకు థియేటర్లు మూతపడినట్టుగా సమాచారం. దీంతో సినిమాల ప్రదర్శనకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదరించబడుతోన్న పుష్ప, శ్యామ్ సింగ రాయ్, అఖండ చిత్రాలకు కలెక్షన్లపై ఈ ప్రభావం కనిపిస్తుంది. 

Also Read: ఏపీలో 175 థియేటర్లు క్లోజ్.. RRR, రాధే శ్యామ్ పరిస్థితి ఏంటి ?

ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా ధరల తగ్గింపు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చుందకు అగ్ర హీరో చిరంజీవి (chiranjeevi) రంగంలోకి దిగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పెద్ద సినిమాలు విడుదలకు సమయం దగ్గరపడం, మూతపడుతున్న థియేటర్ల రోజురోజుకు పెరగడం సినీ పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అగ్ర హీరోలు, నిర్మాతలు భావిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ప్రభుత్వ పెద్దలను కలిసేందకు సినీ పరిశ్రమ ప్రముఖులు  (tollywood celebrities) ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి అంశాలపై గతంలో పేర్ని నానితో పలువురు నిర్మాతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి మంత్రి నానితో భేటీ కావాలని భావిస్తున్నారు. కొందరు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో తెరవెనక మంతనాలు కూడా సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

రేపు మంత్రి Perni Naniని కలిసి చర్చించాలని సినీ పరిశ్రమ ప్రముఖులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై స్పష్టత లేదు. మంత్రి పేర్ని నాని నుంచి సానుకూలమైన స్పందన వస్తేనే సినీ ప్రముఖుల భేటీకి అవకాశం దొరుకుతుంది. మంత్రి నాని.. ఈ విషయాన్ని ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపి.. ఆయన అనుమతి లభిస్తేనే సినీ ప్రముఖలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 

ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నిస్తున్న థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు..
ఓవైపు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని సినిమా టికెట్ల ధరల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని సినీ పరిశ్రమ ప్రముఖులు అడుగులు వేస్తుంటే.. మరోవైపు సినిమా టికెట్ రేట్ల విషయమై ప్రభుత్వంతో చర్చలకు  థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు.. మంత్రి పేర్ని నానిని కోరారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి సమయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతున్నట్టుగా వారు చెబుతున్నారు. ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని అంటున్నారు. అయితే రేపు రేపు సచివాలయంలో మంత్రి పేర్ని నానిని థియేటర్ యజమానులు,డిస్ట్రిబ్యూటర్లు కలిసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios