Asianet News TeluguAsianet News Telugu

#RTC strike సడక్ బంద్ వాయిదా, దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి: సమ్మెపై రేపు తుది నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. మరోవైపు ఆదివారం నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి దీక్షను విరమించారు. 
 

TSRTC jac leaders ashwathama reddy and rajireddy ends hunger strike in osmania hospital
Author
Hyderabad, First Published Nov 18, 2019, 7:07 PM IST

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. మరోవైపు ఆదివారం నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి దీక్షను విరమించారు.

జేఏసీ నేతలు కోదండరామ్, చాడ వెంకటరెడ్డి, మందకృష్ణ మాదిగ వారితో దీక్షను విరమింపజేశారు. దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుందని తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ తెలిపారు.

రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. జడ్జిమెంట్ కాపీ చూశాకా తమ నిర్ణయం ఉంటుందని.. మంగళవారం సమ్మె యధాతథంగా కొనసాగుతుందన్నారు. సడక్ బంద్, రాస్తారోకో మాత్రం వాయిదా వేశామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

Also read:2 వారాల్లో తేల్చండి: ఆర్టీసీపై లేబర్‌ కమిషనర్‌‌కు హైకోర్టు ఆదేశం

రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు  చెప్పింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సమ్మెను విరమించాలని హైకోర్టు జేఎసీ నేతలను కోరింది.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇరువర్గాలు తమ వాదనను విన్పించాయి.ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో పాటు ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

తమకు కూడ కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది. పరిధిని దాటి ముందుకు వెళ్లలేమని  హైకోర్టు చెప్పింది.ఈ విషయాన్ని పరిష్కరించాలని కోరుతూ కార్మిక కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.

Also Read:ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మంత్రులవేనా: కేసీఆర్‌కు విజయశాంతి ప్రశ్నలు

రెండు వారాల్లో ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది.  ఈ విషయాన్ని కార్మికశాఖ న్యాయస్థానం చూసుకొంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది.  అయితే సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో తాము పరిధి దాటి ముందుకు వెళ్లలేమని హైకోర్టు చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios