హైదరాబాద్: రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు  చెప్పింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సమ్మెను విరమించాలని హైకోర్టు జేఎసీ నేతలను కోరింది.

Also read:కేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇరువర్గాలు తమ వాదనను విన్పించాయి.ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో పాటు ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Also read:ప్రభుత్వాన్ని విపక్షాలు కూలుస్తాయి: సునీల్ శర్మను డిస్మిస్ చేయాలన్న ఉత్తమ్

తమకు కూడ కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది. పరిధిని దాటి ముందుకు వెళ్లలేమని  హైకోర్టు చెప్పింది.ఈ విషయాన్ని పరిష్కరించాలని కోరుతూ కార్మిక కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.

రెండు వారాల్లో ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది.  ఈ విషయాన్ని కార్మికశాఖ న్యాయస్థానం చూసుకొంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది.  అయితే సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో తాము పరిధి దాటి ముందుకు వెళ్లలేమని హైకోర్టు చెప్పింది.