ఆర్టీసీ ప్రయాణికులకు పంద్రాగస్టు ఆఫర్ వచ్చింది. సీనియర్ సిటిజన్లకు, 24 గంటల అపరిమిత ప్రయాణానికి కొనుగోలు చేసే టీ 24 టికెట్లపై భారీ రాయితీ ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: పంద్రాగస్టు వేడులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశమంతటా ఆగస్టు 15వ తేదీన నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆగస్టు 15న సీనియర్ సిటిజన్లు, హైదరాబాద్ సిటీలో ప్రయాణం చేసే వారికి టికెట్‌లో భారీ రాయితీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు ఆఫర్లను ప్రకటించింది. అయితే.. ఇవన్నీ కేవలం పంద్రాగస్టు రోజు వరకే. ఇంతకీ ఆ ఆఫర్లు ఏమిటంటే?
హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేలా ఒక ఆఫర్ ఉన్నది. అదే టీ 24 టికెట్. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ. 120. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ. 100గా ఉన్నది. పిల్లలకు ఈ టికెట్ రూ. 80గా ఉన్నది. అయితే.. పంద్రాగస్టు రోజున ఈ టికెట్ రేట్‌ను భారీగా తగ్గించింది.
24 గంటల అపరిమిత ప్రయాణం కోసం కొనుగోలు చేసే టీ 24 టికెట్‌ను రూ. 75కే ఇవ్వనుంది. అదే పిల్లలకు రూ. 50కే పరిమితం చేయనుంది.
Also Read: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఘటన.. ముగిసిన చైల్డ్ రైట్స్ కమిటీ విచారణ
ఇక గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లోనూ ఆఫర్ల ప్రకటించింది. అది వయోవృద్ధులకు సంబంధించినది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతాన్ని రాయితీ కల్పిస్తున్నది. అంటే.. సీనియర్ సిటిజన్ల టికెట్ ఆగస్టు 15వ తేదీన సగానికి పడిపోతుంది.
ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు, స్పష్టత కావాలంటే 040-69440000, 040-23450033లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చునని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
