హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై విచారణ ముగిసింది. ఆదివారం చైల్డ్ రైట్స్ కమిటీ సభ్యులు విచారణ జరిపింది.   నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నారు చైల్డ్ రైట్స్ కమిటీ సభ్యులు.  

హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై విచారణ ముగిసింది. ఆదివారం చైల్డ్ రైట్స్ కమిటీ సభ్యులు విచారణ జరిపింది. దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్‌డీ హరికృష్ణ సహా విద్యార్ధుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అమ్మాయిలను ఒక్కొక్కరిగా పిలిచి ఆరా తీశారు. అలాగే గర్ల్స్ హాస్టల్‌లో బాలికలు, స్టాఫ్, కోచ్‌లను అధికారులు విచారించారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నారు చైల్డ్ రైట్స్ కమిటీ సభ్యులు. 

మరోవైపు.. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ పనిచేస్తున్న హరికృష్ణపై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మేడ్చల్ జిల్లా యువజన అధికారిగా సుధాకర్ పనిచేశారు. అయితే స్పోర్ట్స్ స్కూల్ పరిణామాలపై తాను వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొల్పే ప్రయత్నం చేస్తానన్నారు. 

ALso Read: వారంతా నా కూతుళ్లతో సమానం: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఓఎస్‌డీ హరికృష్ణ

కాగా.. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసిన విషయం తెలిసిందే. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై ఓఎస్‌డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పుడుతున్నాడనే మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్‌డీ హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హరికృష్ణ తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని హరికృష్ణ కోరారు.