టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో  సిట్  నోటీసులపై రేవంత్ రెడ్డి  స్పందించారు.  తన  వద్ద  ఉన్న  ఆధారాలను సిట్ కు అందిస్తానని  రేవంత్ రెడ్డి తెలిపారు.  

నిజామాబాద్: తనను వేధించేందుకే సిట్ నోటీసులు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సిట్ నోటీసులు ఇస్తుందని ఊహించానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్టుగానే మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పారు. 

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా ప్రశ్నాపత్రాలు సంతలో సరుకులా మారాయని ఆయన ఆరోపించారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖకు సంబంధం లేదని కేటీఆర్ అంటున్నారన్నారు. కంప్యూటర్ల కొనుగోలు, నిర్వహణ అంతా టీఎస్‌టీఎస్‌దేనని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐటీ శాఖ అనుమతి తీసుకున్నాకే కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ శాఖ కిందే టీఎస్‌టీఎస్ పనిచేస్తుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. టీఎస్‌టీఎస్ చైర్మెన్ జగన్నాథరావు కేసీఆర్ కు దగ్గర బంధువు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

టీఎస్‌సీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి తిరుపతికి మంది సంబంధాలున్నాయన్నారు. వీరిద్దరూ కూడా పక్క పక్క గ్రామాలకు చెందినవారేనని ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రాసిన వారికి తిరుపతి, రాజశేఖర్ రెడ్డి మండలానికి చెందిన అభ్యర్ధులకు మంచి మార్కులు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : సిట్ నోటీసులు అందలేదన్న రేవంత్ రెడ్డి

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ కార్యాలయం చక్కబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి రెండు మూడు రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ కు ఇంచార్జీగా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ కు కేటీఆర్ బావమరిదికి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు.