టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : సిట్ నోటీసులు అందలేదన్న రేవంత్ రెడ్డి
సిట్ జారీ చేసిన నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సిట్ నోటీసులు అందిన తర్వాత స్పందించనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: సిట్ జారీ చేసిన నోటీసులు ఇంకా తనకు అందలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నోటీసులు అందిన తర్వాత తాను స్పందిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
సోమవారం నాడు రేవంత్ రెడ్డి సిట్ నోటీసుల జారీపై మీడియాతో మాట్లాడారు. సిట్ జారీ చేసిన నోటీసుల్లో ఏముందో తనకు తెలియదని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో రెండు రోజులుగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి ఈ స్కాంతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ స్కాంలో తిరుపతి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కేటీఆర్ పీఏ తిరుపతి, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నిందితుడు రాజశేఖర్ పక్క పక్క గ్రామాలకు చెందినవారుగా రేవత్ రెడ్డి చెప్పారు.
టీఎస్‌పీఎస్‌సీలో గతంలో నిర్వహించిన పరీక్షల్లో తిరుపతి, రాజశేఖర్ ప్రాంతాలకు చెందిన వారికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి సిఫారసు మేరకు రాజశేఖర్ రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీలో చేర్పించారని ఆయన ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో రెండు రోజులుగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి ఈ స్కాంతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ స్కాంలో తిరుపతి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కేటీఆర్ పీఏ తిరుపతి, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నిందితుడు రాజశేఖర్ పక్క పక్క గ్రామాలకు చెందినవారుగా రేవత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీలో గతంలో నిర్వహించిన పరీక్షల్లో తిరుపతి, రాజశేఖర్ ప్రాంతాలకు చెందిన వారికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి సిఫారసు మేరకు రాజశేఖర్ రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీలో చేర్పించారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం కేసులో మంత్రి కేటీఆర్ కార్యాలయం అన్ని అంశాలను చక్కబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కూడా కేటీఆర్ బావమరిదికి అత్యంత సన్నిహితుడు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
also read:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు.. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్.. పూర్తి వివరాలు ఇవే..
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ కేసు విషయమై ఆరోపణలు చేసిన రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారీ చేయాలనే సిట్ అధికారులు న్నారనే సమాచారం. ఈ విషయమై కూడా సిట్ బృందం న్యాయ నిపుణులతో చర్చిస్తుందని ప్రచారం సాగుతుంది.