టీఎస్ సెట్ 2023 పరీక్ష ఈ నెల 17న జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 13న నిర్వహించాల్సిన సెట్ పరీక్షను 17కి మార్చింది ప్రభుత్వం.

ఈ నెల 13న జరగాల్సిన టీఎస్ సెట్ 2023 వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 13న నిర్వహించాల్సిన సెట్ పరీక్షను 17కి మార్చింది ప్రభుత్వం. సెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 10న హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే 14, 15 తేదీల్లో నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Also REad: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల, ప‌రీక్ష‌ల‌కు ముందు అధికారుల సూచ‌న‌లు ఇవిగో..

ఇదిలావుండగా.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణ ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. కళాశాల ప్రిన్సిపాళ్లు తమ లాగిన్ల నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. కచ్చితమైన ఫొటోలు, సంతకాలు, పేర్లు, మాధ్యమాలు, సబ్జెక్టుల కోసం హాల్ టికెట్లను సరిచూసుకోవాలని బోర్డు విద్యార్థులకు సూచించింది. లోపాలను వెంటనే సరిదిద్దేందుకు కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి నివేదించాలని తెలిపింది. 

తెలంగాణ ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

టీఎస్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 180 నిమిషాలు (3 గంటలు) ఒక్కో పేప‌ర్ ప‌రీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.