Hyderabad: తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాళ్లు తమ లాగిన్ల నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు.
TS Intermediate hall tickets released: మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. కళాశాల ప్రిన్సిపాళ్లు తమ లాగిన్ల నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.
విద్యార్థులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి..
కచ్చితమైన ఫొటోలు, సంతకాలు, పేర్లు, మాధ్యమాలు, సబ్జెక్టుల కోసం హాల్ టికెట్లను సరిచూసుకోవాలని బోర్డు విద్యార్థులకు సూచించింది. లోపాలను వెంటనే సరిదిద్దేందుకు కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి నివేదించాలని తెలిపింది.
పకడ్బంది చర్యలు..
పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీ జిల్లాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
టీఎస్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 180 నిమిషాలు (3 గంటలు) ఒక్కో పేపర్ పరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
- మార్చి 15-సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్
- మార్చి 17-ఇంగ్లీష్ పేపర్
- మార్చి 20-మ్యాథ్స్ పేపర్ 1ఏ/ బోటనీ/ పొలిటికల్ సైన్స్
- మార్చి 23-మ్యాథ్స్ పేపర్ 1బీ/జూవాలజీ/ హిస్టరీ
- మార్చి 25-పిజిక్స్/ ఎకనామిక్స్
- మార్చి 28-కెమిస్ట్రీ/ కామర్స్
- మార్చి 31-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జ్ కోర్సు
- ఏప్రిల్ 03-మోడ్రన్ ల్యాంగ్వేజ్/ జియోగ్రఫీ
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి.
- మార్చి 16-సెకండ్ ల్యాంగ్వేజ్
- మార్చి 18-ఇంగ్లీష్
- మార్చి 21-మ్యాథ్స్ పేపర్ 2ఏ/ బోటనీ/ పొలిటికల్ సైన్స్
- మార్చి 24-మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ/ హిస్టరీ
- మార్చి 27-ఫిజిక్స్/ ఎకనామిక్స్
- మార్చి 29-కెమిస్ట్రీ / కామర్స్
- ఏప్రిల్ 01-పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2/ బ్రిడ్జ్ కోర్సు
- ఏప్రిల్ 04-మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2/ జియోగ్రఫీ
