హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగింది. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల త్రిమెన్  కమిటీతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చలు ఫెయిల్ కావడంతో  సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ నేతలు. 

ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు పిలవడంపై ఆర్టీసీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేపట్టడం చట్ట విరుద్ధమంటూ ఇంచార్జ్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హెచ్చరించారు.  

ఇకపోతే ఆర్టీసీ ఎండీకి కౌంటర్ ఇచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తమపై ఎస్మా, పీడీయాక్టులు ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోందని అది సరికాదన్నారు. ఇలాంటి బెదిరింపులను ఎన్నో ఎదుర్కోందని తెలిపారు. 

ఎట్టి పరిస్థితుల్లో సమ్మె జరిగితీరుతుందని స్పష్టం చేశారు. సాయంత్రం నుంచి సమ్మె యథాతథంగా జరుగుతుందని టీఆర్ఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనపై త్రిమెన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో తాము సమ్మెకు దిగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో అమలైంది తెలంగాణలో సాధ్యం కాదా: ప్రభుత్వాన్ని నిలదీసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు

నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె : ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం