సిటీలో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతి

న్యూ ఇయర్ మరింత కిక్ ఇచ్చే విధంగా మందుబాబులకు సర్కారు భలే ఆఫర్ ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ రోజు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

బార్లలు అయితే రాత్రి ఒంటిగంటవరకు… వైన్ షాపుల్లో అయితే రాత్రి 12గంటల వరకు ఇక మద్యం అమ్మకాలు కొనసాగించవచ్చు.

మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. 1500 మంది పోలీసులను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. డ్రంకెన్ డ్రైవ్ , వాహనాల తనిఖీలు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.