Asianet News TeluguAsianet News Telugu

ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేసీఆర్ ఏం చెబుతారో..?

ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

trslp and trs parliamentary party meeting to held on tuesday
Author
First Published Nov 13, 2022, 6:54 PM IST

ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొననుంది. 

Also REad:ఏపీపై కూడా కేసీఆర్ గురి.. మొత్తంగా 100 స్థానాలు టార్గెట్.. బీఆర్ఎస్ ఎన్నికల వ్యుహం ఇదేనా..!

ఇకపోతే... మునుగోడు ఉపఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌పై మరింత దృష్టి పెట్టారు కేసీఆర్. ఉపఎన్నిక ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్న కేసీఆర్. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి అక్కడ అభ్యర్ధులను బరిలో దించాలని యోచిస్తున్న ఆయన.. టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో నేతలకు ఏమైనా ముఖ్యమైన విషయాలు చెబుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios