తెలంగాణలో టీడీపీ ని ఒక రాజకీయ పార్టీ గా గుర్తించమని అంటూ వారి విమర్శలు పట్టించుకునేది లేదని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ‘మియాపూర్ భూముల కుంభకోణంలో చట్టం తమ పని తాము చేసుకు పోతుంది..సీఐడీ సమర్ధంగా పని చేస్తుండగా సిబిఐ అవసరమేమిటి ? తెలంగాణ లో ప్రతిపక్షాలకు పని లేదు అందుకే లేని పోనీ అంశాల పై ఆరోపణలు చేస్తున్నాయి,’ అని ఆయన విమర్శించారు.
మధ్య ప్రదేశ్ లో రైతుల మీద జరిగిన కాల్పులను తెలంగాణా రాష్ట్ర సమితి ఖండించింది. పోలీసుల కాల్పులలో మరణించిన రైతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి .
ఈరోజు ప్రభుత్వ విప్ పల్లారాజేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతలు రైతు ల పై మొసలి కన్నీళ్లు కార్చడం ఇక నైనా మానుకోవాలని అన్నారు. మధ్య ప్రదేశ్ లో రైతులు కోరుతున్నవి తెలంగానాలో అమలు జరిగాయని అంటూ తెలంగాణా లో రుణ మాఫీ చేసిన విషయం, గిట్టుబాటు ధర లు అమలుచేస్తున్న తీరు ను రాష్ట్ర బీజేపీ నేతలు తమ జాతీయ నాయకత్వానికి తెలియ జేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
‘బీజేపీ కి అసలు రైతుల సమస్యలే తెలియవు.అమిత్ షా కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. కేంద్రంలో వరసగా అధికారం లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాలే రైతాంగ సంక్షోభానికి కారణం,’ అని ఆరోపించారు.
రైతులకు గత మూడేళ్ళ లో దేశం లో ఏ ప్రభుత్వం చేయని మేళ్లను టిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందని, దేశం లో తెలంగాణ తప్ప ఏ ప్రభుత్వం 17 వేల కోట్ల రుణ మాఫీ చేయ లేదని ఆయన ఆన్నారు.
తెలంగాణ లో టీడీపీ ని ఒక రాజకీయ పార్టీ గా గుర్తించమని అంటూ వారి విమర్శలు పట్టించుకునేది లేదని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ‘మియాపూర్ భూముల కుంభకోణంలో చట్టం తమ పని తాము చేసుకు పోతుంది..సీఐడీ సమర్ధంగా పని చేస్తుండగా సిబిఐ అవసరమేమిటి ? తెలంగాణ లో ప్రతిపక్షాలకు పని లేదు అందుకే లేని పోనీ అంశాల పై ఆరోపణలు చేస్తున్నాయి,’ అని ఆయన విమర్శించారు.
