మైలార్ దేవ్ పల్లికి చెందిన ఆయన పార్టీలో టీడీపీ నేతల పెత్తనం సహించలేక దారుణానికి ఒడిగట్టారు. ఈ రోజు ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోఆత్మహత్యకు పాల్పడ్డారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక... టీఆర్ఎస్ అధికారం చేపట్టాక... ఎంత మార్పు... ఎంత తేడా..

నాడు టీఆర్ఎస్ ను దుమ్మెత్తి పోసిన ఇతర పార్టీ నేతలే ఇప్పుడ ‘కారు’ స్టీరింగ్ తిప్పేవాళ్లయ్యారు. పార్టీ పునాదుల నుంచి పనిచేసిన కార్యకర్తలు మాత్రం కరివేపాకులయ్యారు.

అరువు కార్యకర్తలకు, పక్క పార్టీల నుంచి జంప్ చేసిన నేతలకు పదవులొస్తుంటే... పార్టీ కోసమే పనిచేసిన నికార్సైన గులాబీ కార్యకర్తలకు కనీసం పనులు కూడా దక్కడం లేదు.

16 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో సొంతమనుషులకంటే అరువొచ్చిన పచ్చ పార్టీ నేతలకే పెద్ద పీఠాలు దక్కుతున్నాయి.

ఆ వేదన ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమ సమయంలో జైలు కెళ్లినా బాధపడని కార్యకర్తలు ఇప్పుడు ఇంటి పార్టీలోనే పరాయి వారి పెత్తనం సహించలేక రగిలిపోతున్నారు.

అలా రగిలిపోయి రాలిపోయిన ఓ పార్టీ కార్యకర్త మహిపాల్ రెడ్డి. మైలార్ దేవ్ పల్లికి చెందిన ఆయన పార్టీలో టీడీపీ నేతల పెత్తనం సహించలేక దారుణానికి ఒడిగట్టారు. ఈ రోజు ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి వద్ద లభించన సూసైడ్ నోట్ ప్రకారం పార్టీలో టీడీపీ నేతల పెత్తనం సహించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

ముఖ్యంగా సూసైడ్ లెటర్ లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే, ఎన్నికల వేళ కేటీఆర్ మాటలు నమ్మి తాము పనిచేశామని, టీడీపీ నేతల పార్టీలోకి వచ్చినా పదవులకోసం ఆశపడకుండా పనిచేశామని అయితే తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ 16 వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఓ గులాబీ కార్యకర్త ఆత్యహత్యకు పాల్పడం పార్టీ శ్రేణల్లో ఆందోళన కలగిస్తోంది.టీఆర్ఎస్ లో బయటి పార్టీ నేతల పెత్తనమే ఉంటోందని చాలా రోజుల నుంచి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా పార్టీ అధినేత ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించడం లేదు.