Asianet News TeluguAsianet News Telugu

మోడీపై అవిశ్వాసం: చంద్రబాబుకు కేసిఆర్ ఝలక్, ఓవైసీ సై

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు.

TRS not supported TDP no trust motion

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి తెలంగాణ రాష్ట్ర సమితి  (టీఆర్ఎస్) మద్దతు ఇవ్వలేదు. అవిశ్వాసంపై ఒక వేళ ఓటింగ్ జరిగితే కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం లేదని బుధవారం జరిగిన పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది.

 అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరగా వివిధ పార్టీల ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలిపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ సభ్యులు ఉన్నారు. 

దాదాపు 50మందికిపైగా ఎంపీలు లేచి నిలబడి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేశారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిస్తామని చెప్పి, ఆ తర్వాత తేదీలను కూడా ఖరారు చేశారు.
 
స్పీకర్ నిర్ణయంపై కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జునఖర్గే అభ్యంతరం తెలిపారు. పార్లమెంటులో అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పట్టించుకోకుండా టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అయితే నిబంధనల ప్రకారమే అవిశ్వాస నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ స్పష్టం చేశారు.  
 
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు అంటున్నారు. కాగా, ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios