నిప్పుల గుండంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్

trs mla shankar naik walks on fire
Highlights

  • అయ్యప్ప మాలలో ఉన్న శంకర్ నాయక్
  • స్వాములతో కలిసి నిప్పుల్లో నడిచిన ఎమ్మెల్యే

నిత్యం వార్తల్లో ఉండే టిఆర్ఎస్ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తాజాగా పెద్ద సాహసం చేశారు. ఆయన అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. నిప్పుల గుండంలో నడిచి ఔరా అనిపించారు.

మహబూబాబాద్ లో అయ్యప్ప భక్తులంతా నిప్పుల గుండంలో నడిచారు. బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు. ఆయన అయ్యప్ప మాల ధరించి ఉన్నందున ఆయన కూడా అందరు అయ్యప్ప భక్తుల మాదిరిగానే నిప్పుల్లో నడిచారు. ఈ వార్త జిల్లాలోనే కాక తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయింది.

loader