డీఎస్ తనయుడు సంజయ్ అరాచకాలకు పాల్పడటం కొత్త కాదని, గతంలో చాలాసార్లు ఇలాగే చేశాడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, అందులో డీఎస్ కీలక స్థానంలో ఉండటంతో ఈ అరాచకాలేవీ బైటకు రాలేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నిస్పక్షపాతంగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనలో సంజయ్ లైంగిక వేధింపులు బైటపడ్డాయని బాజిరెడ్డి తెలిపారు. అయినా డీఎస్ కొడుకు వేదింపులకు మొదట ఫిర్యాదు చేసింది ప్రజా సంఘాల నాయకురాలు సంధ్య అని బాజిరెడ్డి గుర్తుచేశారు. 

ఇక డీఎస్, డీఎస్ కుటుంబం నిజామాబాద్ జిల్లాకు పట్టిన చీడ పురుగులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల నిజామాబాద్ జిల్లా అభివృద్దిలో 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఆయన ఫైరవీలు సాగడం లేదని డీఎస్ మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారన్నారు. ఆ విషయం తెలిసే జిల్లా నాయకులమంతా కలిసి ఆయనపై ముఖ్యమంత్రికి పిర్యాదు చేసినట్లు బాజిరెడ్డి తెలిపారు.

డీఎస్ కు ఏమాత్రం సిగ్గున్నా వెంటనే పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుని బ్రతిమాలితే డీఎస్ కు రాజ్యసభ ఎంపి పదవి ఇచ్చారని, ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేస్తే రాజ్యసభకు చేయాల్సి వస్తుందని భయపడుతన్నారని అన్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే రాజ్యసభ పదవిలోనే కొనసాగుతూ అక్రమాలకు పాల్పడవచ్చని డీఎస్ ప్లాన్ చేసుకున్నాడని బాజిరెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

సంజయ్‌పై అత్యుత్సాహం, అరవింద్ ముందే చెప్పాడు: డీఎస్

కేసీఆర్ కేబినెట్ లో అసంతృప్తులు: డీఎస్ సంచలనం

దయచేసి సస్పెండ్ చేయండి, లేదంటే.. : డీఎస్