హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బుధవారం నాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసాలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బుధవారం నాడు భైంసా వెళ్లనున్నట్టుగా రాజాసింగ్ ప్రకటించారు. 

Also read:రెండు వర్గాల మధ్య వివాదం...బెైంసాలో తీవ్ర ఉద్రిక్తత

రెండు రోజుల క్రితం భైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గం ఇళ్లపై మరో వర్గం దాడికి దిగింది. ఈ పరిణామాలతో రాజాసింగ్ భైంసా వెళ్లి తీరుతానని ప్రకటించారు. దీంతో రాజాసింగ్‌ను గోషామహల్‌లోని  ఆయన నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజాసింగ్  ఇళ్లు వదిలి రాకుండా గోషా మహల్ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే తాను భైంసా వెళ్లి తీరుతానని రాజాసింగ్ ప్రకటించారు. భైంసాలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.