బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి, పలువురికి గాయాలు
బంగ్లాదేశ్ లో ఇవాళ ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఢాకా:బంగ్లాదేశ్ లో సోమవారంనాడు రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.ఇవాళ సాయంత్రం 04:15 గంటల సమయంలో కిషోర్ గంజ్ నుండి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు సుమారు 15 మృతదేహలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా బీడీ న్యూస్24 ప్రకటించింది.
ఇవాళ సాయంత్రం 04:15 గంటల సమయంలో కిషోర్ గంజ్ నుండి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు సుమారు 15 మృతదేహలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా బీడీ న్యూస్24 ప్రకటించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది.ఢాకా వెళ్లే గోధూలి ఎక్స్ ప్రెస్ రైలు, ఛటోగ్రామ్ కు వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.
ఈ ప్రమాదం తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారని స్థానిక మీడియా తెలిపింది. రైలు కోచ్ లకింద పలువురు చిక్కుకుపోయినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.