Asianet News TeluguAsianet News Telugu

ఇంటికో ఓటు కాంగ్రెస్‌కే: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంపై రేవంత్


హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచార వ్యూహాంపై పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై చర్చించారు.

Tppc Chief Revanth Reddy meeting withparty leaders  on Huzurabad bypoll
Author
Hyderabad, First Published Oct 21, 2021, 3:16 PM IST

హైదరాబాద్: ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.హుజురాబాద్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు Revanth Reddy గురువారం నాడు భేటీ అయ్యారు.రానున్న  వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలతో  రేవంత్ చర్చలు జరిపారు.హుజురాబాద్ ఎన్నికలలో నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని ఆయన సూచించారు. 

also read:Huzurabad Bypoll: బిజెపిలో ఈటల అనుమానమే... ఈ డౌట్ కాషాయపార్టీదే: మంత్రి హరీష్ సంచలనం

Congress పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలన్నారు.ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలనే విషయమై ఓటర్లకు వివరించాలని ఆయన నేతలను కోరారు.Bjp, టీఆర్‌ఎస్‌ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసిన నష్టాలను వివరించాలని నేతలకు తెలిపారు.బీజేపీ, Trs లోపాయికారి ఒప్పందాలను చీకటి రాజకీయాలను బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.

ఈ ఉప ఎన్నికలకు కారణం ఎవరు, దళిత బంధును అడ్డుకున్నదెవరనే విషయాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీ విషయమై కూడ లోతుగా చర్చ జరగాలన్నారు.  ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బరిలోకి దిగాడు. బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా  గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios