Huzurabad Bypoll: బిజెపిలో ఈటల అనుమానమే... ఈ డౌట్ కాషాయపార్టీదే: మంత్రి హరీష్ సంచలనం
జమ్మికుంట మండలం మాడిపల్లిలో మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఈటల బిజెెపిలో కొనసాగడం అనుమానమేనంటూ బాంబు పేల్చారు.
కరీంనగర్: ఈటల రాజేందర్ భారత్ మాతాకీ. బీజేపీకి. మోదీకి జై అంటలేడు... దీన్నిబట్టి చూస్తూ ఆయన బీజేపీ పార్టీలో ఉంటాడని అనిపించడం లేదంటూ అనుమానం వ్యక్తం చేసారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కేవలం తన అవసరం కోసమే ఈటల బీజేపీలో చేరాడని... అన్యమనస్కంగా పార్టీలో ఉంటున్నాడు బిజెపి వాళ్లే అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయనఆయన అంటించుకున్న బురద మనందరికి అంటించాలని చూస్తన్నాడని అన్నారు.
eatala rajender తన బాధను అందరి బాధగా చూపెట్టి లభ్ది పొందాలని చూస్తే ముఖ్యమంత్రి kcr మనందరి బాధను తన బాధగా భావించి పనులన్నీ చేస్తున్నారన్నారు. అభివృద్ది, సంక్షేమం కళ్లముందే వుంది... ప్రజలే ఎవరి పక్షాన నిలవాలో ఆలోచించుకోవాలని harish rao సూచించారు.
jammikunta మండలం మాడిపల్లిలో మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి gellu srinivas yadav తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... మొసలి కన్నీరు కారుస్తూ ఏడిస్తే, నాలుగు డైలాగులు కొడితే కడుపు ప్రజల కడుపు నిండదంటూ ఈటల ను ఎద్దేవా చేసారు. మేం చెప్పింది వినండి.. ఆలోచించి ఓటేయ్యండని సూచించారు.
read more Huzurabad Bypoll: కుట్రలకు తెరతీసి... ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఈటల: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
''trs ప్రభుత్వం 200 పెన్షన్ 2016 రూపాయలకు పెంచింది. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తోంది. ముందుగా కళ్యాణ లక్ష్మి ఎస్సీలతో ప్రారంభమైంది. ఆ తర్వాత అన్ని కులాలు, మతాలలో ఉన్న పేదలకు వర్తింపజేశారు. అలాగే దళిత బందు కూడా దళితులతో ప్రారంభమైంది. కళ్యాణ లక్ష్మి తరహాలోనే అన్ని కులాలకు సాయం అందుతుంది'' అని వివరించారు.
''bjp రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తోంది. మేం ఇచ్చేది ఇస్తున్నాం. బీజేపీ వాళ్లు మాత్రం ఏం ఇస్తారో ఎందుకు చెప్పడం లేదు. ఎందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు. బీజేపీ గెలవనే గెలవదు. గెల్చినా మంత్రి ఈటల మంత్రి అయ్యేది ఉందా... పనులు చేసేది ఉందా? కానీ ఈ నెల 30తర్వాత కూడా సీఎంగా కేసీఆర్ ఉంటారు. పనులన్నీ ఆయనే చేస్తారు'' అన్నారు.
''ఎస్సీలకు dalit bandhu డబ్బులు పడ్డాయి. ఇంకో 50 మందికి రాకపోవచ్చు. ఢిల్లీలో బీజేపీ కంప్లైంట్ ఇచ్చిండ్రు. 30 వ తేదీ వరకు ఇవ్వవద్దు అని. కాని ఎన్ని రోజులు. 4వతేదీ తర్వాత మేం మళ్ళీ వస్తం. రాని వాళ్లకు యూనిట్లు వచ్చేలా మేమే గ్రౌండ్ చేస్తాం. గెల్లు శ్రీను గెలిస్తే నేను అధికారులతో వస్తా.. ఇక్కడ నిలబడి మీకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తా. అందరి సమస్యలు దశల వారీగా పరిష్కరించుకుందాం. మేం ఉపన్యాసాలిస్తలేం. మేం పని చేసి చూపిస్తం'' అని హరీష్ వెల్లడించారు.
''ఈటల రాజేందర్ కు ఆరు సార్లు గెలిపించినా ఇక్కడ పని చేయలేదు. మీ ఇంటి జాగా ఉంటే ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల 4 వేల సాయం అందిస్తాం. మీ ఇళ్లు కట్టిస్తాం. కేసీఆర్ వచ్చాకే రైతు బంధు, రైతు బీమా ఇచ్చినం. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి కాలువల్లో నీరు వచ్చేలా చేసింది కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ దిక్కు చూస్తే...కాలువల్లో కావల్సినంత నీరు పారుతోంది'' అని తెలిపారు.
read more దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్
''రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిండ్రు. బీజేపీ ఏం చేసింది. డీజిల్ ధర పెంచితే రైతులపై భారం పడింది. ఇవ్వాళ పొద్దున కూడా డిజీల్ ధర పెంచింది. 21 రోజుల్లో 17 సార్లు డిజిల్, పెట్రోల్ ధరలు పెంచింది.దీని వల్ల రైతుపై భారం పడుతోంది. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి మార్కెట్లు లేకుండా చేస్తారట. బావుల కాడ మీటర్లు పెడతరంట. టీఆర్ఎస్ వచ్చాక రైతు బంధు ఇచ్చినం, రైతు బీమా ఇచ్చినం, నీటి తీరువా రద్దు చేసినం. వడ్లు వచ్చినయంటే ఊరూరా సెంటర్లు పెట్టి కొంటున్నం. అన్ని చోట్ల సెంటర్లు పెట్టమన్నం. తరుగు అంటే తోలు తీస్తం అన్నం. రైతులను ఇబ్బంది పెట్టమని చెప్పినం'' అని వెల్లడించారు.
''ఈటల గెలిస్తే బీజేపీకి లాభం. గెల్లు శ్రీను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభం. టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు సేవ లభిస్తుంది. అవునన్నా కాదన్నా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం. వడ్డీలేని రుణం పండుగ ముందు ఇవ్వాలంటే ఇచ్చినమా లేదా...మహిళ భవనం లేదంటే మంజూరు చేసినమా లేదా... మీ ఊరు మీద రెండు కోట్ల పనులు మంజూరయి ఉన్నయి. అవన్నీ పూర్తి కావాలే. శివాలయం పనులు చేసినం.తమ్ముడు గెలిపిస్తే ఇద్దరం కలిసి ఆ పనులన్న పూర్తి చేయిస్తం'' అని హరీష్ తెలిపారు.
''కోల పీట, రోడ్డు రోలర్ వంటి గుర్తులు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఉన్నాయి. కాబట్టి వృద్దులు, పెద్దలు జాగ్రత్తగా చూసిమరీ కారు గుర్తుకే ఓటువేయండి. కారు గుర్తు ఎక్కడుందో అడగండి. పైనుండి రెండో నెంబర్ మీద ఉంటుంది. దానిపైనే ఓటు వేయండి. కారును పోలిర గుర్తులవల్ల దుబ్బాకలో 3600 ఓట్లు పోయినయి. చాలా మంది రోడ్డురోలర్ , కోల పీట గుర్తుకు వేసిండ్రు. మీరూ అలాగే గందరగోళపడవద్దు. కనపడకపోతే అడిగి మరీ కారు గుర్తుకే ఓటు వేయండి'' అని హరీష్ కోరారు.