అసెంబ్లీ ఎదుట బైఠాయించిన నేతలు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్
కాంగ్రెస్ నేతల బైఠాయింపుతో సోమవారం అసెంబ్లీ ఎదుట వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తక్షణం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా తలపెట్టింది. రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని.. వాటిపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశ పర్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.నిరసనలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్‌అలీ, జానారెడ్డి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తమను శాసనసభలోకి రానివ్వకుండా అడ్డుకుంటుందని ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీఏసీ సమావేశాల్లోని అజెండాను సర్కారు పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సర్కారు భయపడుతోందని విమర్శించారు.
సభను వెంటనే సమావేశ పర్చకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దంటే ఎలా అంటూ అసెంబ్లీ కార్యదర్శి సదారాంను పిలిచి మాట్లాడారు.
