లఖీంపూర్ ఖేరీ హింస.. బాధిత రైతు కుటుంబాలకు టీపీసీసీ తరపున ఆర్ధిక సాయం: రేవంత్ రెడ్డి ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ (lakhimpur kheri)లో రైతులపై దాడికి నిరసనగా టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ (candle protest) నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు క్యాండీల్ ర్యాలీ జరిగింది

tpcc chief revanth reddy slams pm narendra modi over lakhimpur kheri incident

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ (lakhimpur kheri)లో రైతులపై దాడికి నిరసనగా టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ (candle protest) నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు క్యాండీల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), వీహెచ్, సీతక్క, సంపత్ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ, ఆదానీల ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ (Narendra Modi), అమిత్ షా (Amit shah), యోగి ఆదిత్యనాథ్‌ (yogi adityanath) ల పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (congress) పోరాడుతోందన్నారు. బీజేపీ (BJP)తో తమకు ఎలాంటి ఒప్పందం లేదని చెప్పే కేసీఆర్.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ (telangana assembly)లో తీర్మానం ఎందుకు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణాన్ని అసెంబ్లీలో ఎందుకు ఖండించలేదని ఆయన నిలదీశారు. రైతులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ వేరు వేరు కాదని.. వీరిద్దరూ రైతు వ్యతిరేకులని ఆయన దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనను కేసీఆర్ ఖండించలేదంటే.. దానిని సమర్ధించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మోడీ వైపున్నారని.. మోడీ అంబానీ (mukesh ambani), ఆదానీ (gautam adani)లవైపున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పేదలు, రైతుల వైపు వున్నారని రేవంత్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలకు టీపీసీసీ తరపున లక్ష చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 

Also Read:UP Violence : కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేస్.. రైతుల మీదికి కారు ఎక్కించిన ఘటనలో 4 రైతులతో సహా 8 మంది మృతి

మరోవైపు ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతుల (protesting farmers)మీదికి కారు తోలడాన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra) కుమారుడిపై సోమవారం హత్య కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) లో మంత్రి కుమారుడితో పాటు ఇంకా ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. నాటి ఘటనలో ఎనిమిది మంది మరణించగా, అందులో నలుగురు రైతులు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios