UP Violence : కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేస్.. రైతుల మీదికి కారు ఎక్కించిన ఘటనలో 4 రైతులతో సహా 8 మంది మృతి
రైతుల ఆందోళన మీద ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా చేసిన వ్యాఖ్యలతో వారు తీవ్రంగా అసంతృప్తి చెందారు. దీంతో ఇద్దరు మంత్రుల పర్యటనను అడ్డుకోవడానికి రైతులు సమావేశమయ్యారు. గత నెలలో, మిశ్రా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన మీద విమర్శలు గుప్పించారు. ఇది "10-15 మంది మాత్రమే చేస్తున్న నిరసన అని, తలుచుకుంటే వారిని లైన్‌లో ఉంచడానికి కేవలం రెండు నిమిషాలు చాలు" అని అన్నారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతుల (protesting farmers)మీదికి కారు తోలడాన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra)కుమారుడిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) లో మంత్రి కుమారుడితో పాటు ఇంకా ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, అందులో నలుగురు రైతులు ఉన్నారు.
రైతుల ఆందోళన మీద ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా చేసిన వ్యాఖ్యలతో వారు తీవ్రంగా అసంతృప్తి చెందారు. దీంతో ఇద్దరు మంత్రుల పర్యటనను అడ్డుకోవడానికి రైతులు సమావేశమయ్యారు. గత నెలలో, మిశ్రా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన మీద విమర్శలు గుప్పించారు. ఇది "10-15 మంది మాత్రమే చేస్తున్న నిరసన అని, తలుచుకుంటే వారిని లైన్‌లో ఉంచడానికి కేవలం రెండు నిమిషాలు చాలు" అని అన్నారు.
ఈ వ్యాఖ్యలతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా జరుగుతున్న తమ ఆందోళన మీద ఇలాంటి వ్యాఖ్యలతో వారు విసిగిపోయారు. దీంతో "మంత్రుల రాకను ఆపడానికి రైతులు హెలిప్యాడ్‌ను ఘెరావ్ చేయాలనుకున్నారు. ఘెరావ్ పూర్తయ్యాక.. రైతులు తిరిగి వెళ్తుండగా, మూడు కార్లు చాలా వేగంగా వచ్చాయి. నడిచి వెడుతున్న రైతుల మీదికి దూసుకువెళ్లాయి. ఈ ఘటనలో ఒక రైతు అక్కడికక్కడే మరణించాడు. మరొకరు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు "అని రైతు సంఘం నాయకుడు డాక్టర్ దర్శన్ పాల్ అన్నారు. రైతుల మీదికి నడిపిక కారులో మంత్రి కుమారుడు ఉన్నాడని తెలిపారు.
అయితు, తన కుమారుడు ఆశిష్ మిశ్రాకు ఈ హింసతో సంబంధం లేదని మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు. "నా కుమారుడు ఘటన జరిగిన సమయంలో అక్కడ లేడు. దుండగులు ఎవరో కర్రలు, కత్తులతో వారిపై దాడి చేశారు. ఉన్నారు. ఆ సమయంలో నా కొడుకు అక్కడ ఉండి ఉంటే, అతను సజీవంగా బయటకు వచ్చేవాడు కాదు," అని మిశ్రా చెప్పారు. అసలా సమయంలో తన కుమారుడు ఘటన జరిగిన ప్రాంతంలో లేనేలేడని.. "నా కుమారుడు ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ మొత్తం సమయం నేను, నా కుమారుడు, ఉపముఖ్యమంత్రి కలిసే ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు.
వ్యవసాయ చట్టాలు: ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కాన్వాయ్.. ఇద్దరి మృతి
హింస జరిగిన జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అక్కడ CrPC సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించారు. దీనికింద నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధం. ఈ సంఘటన దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అన్ని జిల్లా యంత్రాంగం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించినట్లు తెలిపారు.
కాగా, ఘటన జరిగిన తరువాత భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేశ్ తికైత్ తన మద్దతుదారులతో కలిసి ఈ ఉదయం హింసాత్మక ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని జిల్లాకు చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులు, రైతులతో చర్చ జరిపిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాయమని టికాయత్ చెప్పారు.