Asianet News TeluguAsianet News Telugu

అలా రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర, ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం: రేవంత్ రెడ్డి సంచలనం

టీఆర్ఎస్ పై మరోసారి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం కోసం వైఎఃస్ జగన్ , కేసీఆర్ లు ఆలోచన చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.

TPCC Chief Revanth Reddy serious Comments on KCR and YS Jagan
Author
Hyderabad, First Published Oct 29, 2021, 10:02 PM IST

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం కోసం ys Jagan, Kcrలు ఆలోచన చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ Revanth Reddyఆరోపించారు.శుక్రవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో Ys Sharmila పాదయాత్ర, ఏపీ సమాచార శాఖ మంత్రిPerni Nani  వ్యాఖ్యలు యాధృచ్చికం కావన్నారు. ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ లు తొలి నుండి కలిసి నడుస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

వైసీపీ గౌరవాధ్యక్షురాలు   తెలంగాణలో పర్యటించినందుకు కేసీఆర్ సహకరించినందుకు  ఏపీలో కేసీఆర్ పార్టీ ఏర్పాటుతో పాటు, పోటీకి కూడా వైసీపీ సహకరించే అవకాశం ఉందన్నారు. రెండు రాష్ట్రాలుఎందుకు అనే భావనను తీసుకొస్తారని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర సాగుతుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.గతంలో కేటీఆర్ కు భీమవరంలో స్వాగతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. కేటీఆర్ భీమవరంలో పోటీ చేస్తారో లేదా వలస వచ్చిన విజయనగరం జిల్లా బొబ్బిలిలో పోటీ చేస్తారో తెలియదని ఆయన సెటైర్లు వేశారు.

పర్యావరణ అనుమతులు లేవని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎన్జీటీ స్టే ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఎన్జీటీ ఈ ప్రాజెక్టుపై స్టే ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ను జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారన్నారు.కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టుల డిజైన్లను కేసీఆర్ సర్కార్ మార్చిందని ఆయన విమర్శించారు.పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్టీజీ స్టే ఇవ్వడం దక్షిణ తెలంగాణకు మరణ శాసనమేననే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.

also read:కేసీఆర్ వ్యాఖ్యలకే స్పందించా, కొత్త పార్టీ ఎందుకు: రేవంత్ రెడ్డికి పేర్ని నాని కౌంటర్
టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో కూడా టీఆర్ఎస్ ఏర్పాటు చేయాలని తనకు వినతులు వస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు.రేవంత్ కు ప్రతిరోజూ రాజకీయాలు కావాలని  పేర్నినాని ఎద్దేవా చేశారు.  తెలంగాణ సీఎం Kcr వ్యాఖ్యలపై తాను స్పందించినట్టుగా పేర్ని నాని తెలిపారు. సీఎం Ys Jagan డొంకతిరుగుడుగా మాట్లాడారని ఆయన చెప్పారు. 

 ఏదైనా జగన్ ముక్కుసూటిగానే మాట్లాడుతారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.  నోటితో నవ్వి నొసటితో వెక్కించవద్దని తాను కోరుకొంటున్నానని నాని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా Telangana Assemblyలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయన్నారు. మళ్లీ కొత్త పార్టీ ఎందుకో చెప్పాలని  పేర్ని నాని ప్రశ్నించారు.ఈ వ్యాఖ్యలపై అదే రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలి ఇచ్చే కుట్ర జరుగుతోందన్నారు. ప్లీనరీలో తెలంగాణ తల్లి ప్రత్యక్షం కావడం ఏపీ మంత్రి పేర్నినాని సమైఖ్య రాష్ట్రం ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్ ఉమ్మడి కుట్రగా ఆయన అభివర్ణించారు


 

Follow Us:
Download App:
  • android
  • ios