డీఎస్‌తో రేవంత్ రెడ్డి భేటీ: ఏం జరుగుతుంది?
మాజీ మంత్రి, ఎంపీ డి.శ్రీనివాస్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకొంది. టీఆర్ఎస్ కు చాలా కాలంగా డి.శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు D.Srinivas తో టీపీసీసీ చీఫ్ Revanth Reddy గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా డి.శ్రీనివాస్ పనిచేశారు. 2004లో డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
also read:అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తాం: రేవంత్ రెడ్డి
2014లో తెలంగాణలో Trs అధికారంలోకి వచ్చిన తర్వాత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. Congress పార్టీలో తనను ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డిఎస్ భావించారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ జిల్లా నేతలు డి.శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అప్పటి నుండి టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.ఈ విషయమై Kcr ను కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్ లభ్యం కాలేదు. టీఆర్ఎస్ ఎంపీ పదవికి డి.శ్రీనివాస్ రాజీనామా చేయలేదు.
కొంతకాలం క్రితం డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత Bjpలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. డి.శ్రీనివాస్ తనయుడు అరవింద్ గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఈ గెలుపులో డి.శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
డిఎస్ పెద్ద కొడుకు Sanjay పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిశారు. డిఎస్ ను రేవంత్ రెడ్డి కలవడం రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.కేసీఆర్ సర్కార్ ను వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడం కాంగ్రెస్ తో నే సాధ్యమని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు.దీని కోసం ఆయన కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే డిఎస్‌ను కలిసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మర్యాద పూర్వకంగానే కలిశా: రేవంత్ రెడ్డి
మర్యాద పూర్వకంగానే డీఎస్ ను తాను కలిసినట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.కిందపడి డిఎస్ కు చేయివిరిగింది.దీంతో ఆయనను పరామర్శించానని రేవంత్ రెడ్డి చెప్పారు.డిఎస్ తనకు చాలా దగ్గర మనిషి అని ఆయన గుర్తు చేసుకొన్నారు. తనను రేవంత్ రెడ్డి పరామర్శించడం సంతోషంగా ఉందని డిఎస్ చెప్పారు.డిఎస్ ను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.