Asianet News TeluguAsianet News Telugu

" కల్లాల్లో ధాన్యం కుప్పలు, ఇంటి ముందు శవాలు".. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై Revanth Reddy ఫైర్

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రైతు సమస్యల ప‌రిష్కార తీరులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తోడుదొంగల్లా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  గ‌త మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం అరిగోస‌లు ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో రైత‌న్న ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంద‌నీ,  కల్లాల్లో ధాన్యం కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  
 

Tpcc Chief Revanth Reddy Fires On Trs Leaders Over Paddy Procurement Issue
Author
Hyderabad, First Published Dec 24, 2021, 8:17 PM IST

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Tpcc Chief Revanth Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రైతు సమస్యల ప‌రిష్కార తీరులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జాప్యం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఈ రెండు పార్టీలు తోడుదొంగల్లా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ అంశంలో  తీవ్రస్థాయిలో స్పందించారు. 

తెలంగాణ రైతుల హ‌క్కులను టీఆర్‌ఎస్ స‌ర్కార్  అధికార బీజేపీ ద‌గ్గ‌ర  తాకట్టు పెట్టిందని ఆరోపించారు. రైత‌న్న పండించిన ధాన్యం కొనకుండా,  రైతుల సమస్య నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్   కుట్ర చేస్తున్నారని మండిప‌డ్డారు. ఢిల్లీ నుంచి తెరాస మంత్రుల‌ను ఎందుకు వెన‌క్కి రప్పించార‌ని, ఢిల్లీ నుంచి వ‌చ్చిన మంత్రులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఈ వారం రోజులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి ఏం తేల్చారని నిలదీశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు టీఆర్ఎస్ నాయ‌కులు  వీధినాటకాలకు తెర లేపారని ఎద్దేవా చేశారు. 

Read Also: కృష్ణపట్నం ఆనందయ్యకు జగన్ సర్కార్ షాక్: ఆ మందుకు అనుమతి లేదు.. వాడొద్దన్న ఆయుష్ శాఖ

అదనపు ధాన్యంపై కేంద్రానికి మీరు ఏం నివేదిక ఇచ్చారు? అసలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య ఏం జరిగిందో వెల్లడించండి. అదనపు ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వండి. వానాకాలం పంట కొనుగోలు, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం హామీ ఇచ్చేంతరకు ఢిల్లీలోనే ఉండండి... ఆమరణ దీక్ష చేపట్టండి. కేంద్రం నుంచి హామీ రాకుండా మాత్రం మీరు ఢిల్లీని వదిలి రాష్ట్రానికి రావొద్దు" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గ‌త మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం అరిగోస‌లు ప‌డుతోంద‌ని, తెలంగాణ‌లో రైత‌న్న ప‌రిస్థితి  కల్లాల్లో ధాన్యం కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలవలేదని.. రైతు సమస్యలను ఎందుకు వివరించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ .. మంత్రి కేటీఆర్ కు  గడ్డి పెట్టి మ‌రి పంపారని,  వరంగల్ లో 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యంలో అవ‌క‌త‌వ‌క‌లు వ‌చ్చాయ‌నీ, ఆ విష‌యాన్ని కేంద్రం నిలదీస్తే దొంగల్లా పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్ర‌జానీకాన్ని త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నార‌నీ.. సెంట్రల్ హాల్‌లో ఫొటోలు దిగి పార్లమెంట్‌లో ఆందోళన చేసినట్లు క్రియేట్ చేశార‌ని ఆరోపించారు.  

Read Also: ధాన్యం కొనకుంటే.. ఇండియా గేట్ దగ్గర పారబోస్తాం: మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
 

టీఆర్ఎస్ నిర్వహించిన చావుడప్పు కార్య‌క్ర‌మంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెరాస పిలుపు నిచ్చిన ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత ఎందుకు పాల్గొనలేదని నిల‌దీశారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు రైతుల స‌మస్య‌లను ప‌ట్టించుకోకుండా..  ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. రైతుల చావులకు, వడ్లు కొనకపోవడాని టీఆర్ ఎస్,  బీజేపీ నే కారణమ‌ని ఆరోపించారు. ఖరీఫ్‌లో కొనే ధాన్యం సంగతి వదిలేసి.. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: బదిలీలకు గైడ్‌లైన్స్ విడుదల
 
ఒప్పందం చేసుకున్న మేర‌కే.. తెలంగాణ స‌ర్కార్  బియ్యమే ఇవ్వలేదని కేంద్రం చెబుతోంద‌ని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ రైత‌న్న ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే.. కేటీఆర్, సంతోష్‌ రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గ‌త వారం రోజులుగా..  కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఖరీఫ్‌లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఏదీ తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు..

రైతులు ఎవ్వ‌రూ అధైర్యప‌డ‌వ‌ద్ద‌ని..  తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని  రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తామని తెలిపారు. రైతులంతా ఎర్రవెల్లికి తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios