ఆయుర్వేద వైద్యుడు కృష్ణపట్నం ఆనందయ్యకు (krishnapatnam anandayya) ఏపీ ప్రభుత్వం (ap govt)షాకిచ్చింది. ఆనందయ్య తయారు చేసిన ఒమిక్రాన్ మందుకు తమ అనుమతి లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌కు మందు ఇస్తున్నట్లు ఆనందయ్య దుష్ర్పచారం చేస్తున్నారని ఆయష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆయుర్వేద వైద్యుడు కృష్ణపట్నం ఆనందయ్యకు (krishnapatnam anandayya) ఏపీ ప్రభుత్వం (ap govt)షాకిచ్చింది. గతంలో ఆనందయ్య తయారు చేసిన కోవిడ్ మందును రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత మాట మార్చిన ప్రభుత్వం ... ఆనందయ్యను సైతం మందు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. ఆ తర్వాత ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఆనందయ్య ఓమిక్రాన్ వైరస్‌కు మందు ఇస్తానని చెప్పగానే దాన్ని ఆయుష్ శాఖ (ap ayush department) తప్పుబట్టింది.
ఆనందయ్య తయారు చేసిన ఒమిక్రాన్ మందుకు తమ అనుమతి లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌కు మందు ఇస్తున్నట్లు ఆనందయ్య దుష్ర్పచారం చేస్తున్నారని ఆయష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మందుకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఆయుర్వేద మందు సరఫరాకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని ప్రజలకు ఆయుష్ శాఖ సూచించింది. వైద్యుల సలహాతోనే ఆయుర్వేద, హోమియో మందులు వాడాలని ప్రకటించింది.
వాస్తవానికి గతంలోనూ ఆయుష్ శాఖ ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును అడ్డుకుంది. అప్పట్లో ఉన్న పరిస్ధితుల్లో కరోనా మందుకు (anandayya corona medicine ) భారీగా డిమాండ్ ఉండటంతో తప్పనిసరి పరిస్ధితుల్లో దానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత దాని పంపిణీకి కూడా బ్రేక్ వేసింది. చివరికి ఆనందయ్య మందు ఇప్పించాలని హైకోర్టులో (ap high court) పిటిషన్లు దాఖలు కావడంతో వాటిపై విచారణ జరిపిన న్యాయస్ధానం ఆదేశాలు ఇవ్వడంతో ఆయుష్ శాఖ దిగిరాక తప్పలేదు. తాజాగా ఒమిక్రాన్ మందు విషయంలోనూ ఆయుష్ శాఖ ఆనందయ్యకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరి దీనిపై ఆనందయ్య ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి
