Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: బదిలీలకు గైడ్‌లైన్స్ విడుదల

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను శుక్రవారం నాడు విడుదల చేసింది.  కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను నిర్వహించనున్నారు. 

Telangana Government releases Guidelines for Employees
Author
Hyderabad, First Published Dec 24, 2021, 5:00 PM IST


హైదరాబాద్: Telanganaలో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం Guidelines ను శుక్రవారం నాడు విడుదల చేసింది. కొత్త స్థానికతకు అనుగుణంగా బదిలీలు, పోస్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది.  కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను నిర్వహించనున్నారు. 

Employees నుండి  ఆఫ్షన్లను తీసుకొంటుంది. ఈ విషయమై జిల్లా  కలెక్టర్, జిల్లా అధికారులతో కమిటీ ని ఏర్పాటు చేస్తుంది. వారం రోజుల్లోపుగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగ్‌ల తర్వాత విధుల్లో చేరేందుకు మూడు రోజుల గడువును ఇచ్చింది ప్రభుత్వం.జిల్లా స్థాయి పోస్టింగులకు కూడా గైడ్‌లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలను విడుదల చేయనుంది ప్రభుత్వం.

also read:నియోజకవర్గం నుంచి 100 మందికి దళితబంధు.. ఎమ్మెల్యేల చేతికి లబ్దిదారుల ఎంపిక బాధ్యత ?

రెండు రోజుల క్రితం భార్యా భర్తలైన ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త జోనల్ విధానం ప్రకారంగా ఉద్యోగ బదిలీల ప్రక్రియను చేపట్టింది. 

భార్యాభ‌ర్త‌లు ఒకే చోట ప‌ని చేసేలా ప్ర‌భుత్వం ప‌రిశీల‌న చేస్తుంద‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరిన తర్వాతే అప్పీలతో పాటు, భార్యాభర్తల దరఖాస్తులను పరిశీలించనున్నట్టుగా తెలిపింది. 

జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగ్‌లో చేరిన తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా కేడ‌ర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిప‌తికి అప్పీల్ చేయాలి. జోన‌ల్, మ‌ల్టీ జోన‌ల్ కేడర్ ఉద్యోగులు శాఖాధిప‌తికి అప్పీల్ చేయాలి. ఇలా వచ్చిన అప్పీళ్లన్నింటినీ శాఖాధిపతులు.. సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాలి. పూర్తి విచారణ తర్వాత త్వరితగతిన అప్పీళ్లను పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.

ఉద్యోగస్థులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌజ్ కేసులను పరిశీలించనున్నారు. శాఖాధిపతులు స్పౌజ్ కేసు దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తగిన సిఫారసులతో సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాల్సి ఉంటుంది.  

 ఇటీవల జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో.. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ది జరుగుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. భార్యభర్తలు అయిన ఉద్యోగులు ఒకేచోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా ఉండగలరని, సమర్ధవంతంగా పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. స్థానిక ఉద్యోగాలకు విఘాతం కలగకుండా స్పౌస్ కేసులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. 

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉద్యోగ సంఘాలతో చర్చించారు. తెలంగాణలో ఉద్యోగుల వర్గీకరణ, బదిలీలకు సంబంధించిన విధి విధానాలపై చర్చించారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని  కూడా సీఎస్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.ఉద్యోగులకు నష్టం జరగకుండా కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం విభజన చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ను కోరారు.సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios