తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంపకాలు మళ్లీ జోరందుకున్నాయి. టీఆరెస్ లోకి వలసలు కొనసాగుతున్న తరుణంలో వాటిని అదుపుచేసి పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉంది. అందుకోసం పార్టీలో ఖాళీగా ఉన్న పదవులకు అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి కట్టబెట్టే పనిలో పడింది. 
అందులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫిష‌ర్‌మెన్ డిపార్ట్‌మెంట్ చైర్మ‌న్ గా మెట్టు విజయ్ కుమారును నియమించారు. ఆయన్ను ఈ పదవిలో నియమిస్తూ టి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ పదవికి విజయ్ కుమార్ అన్ని విధాల అర్హుడని ఉత్తమ్ కితాబిచ్చాడు.


ఈ సందర్బంగా విజయ్ మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి ఈ భాద్యతలు అప్పగించడం తనకు పార్టీ పట్ల మరింత గౌరవాన్ని పెంచిందన్నారు.  తనకు పదవి రావడానికి సహకరించిన ఏఐసీసీ ఫిష‌ర్‌మెన్ డిపార్ట్‌మెంట్ చైర్మ‌న్ ప్రతాపన్ కు, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ రాష్ట్రంలోని మస్థ్యకారులను కాంగ్రెస్ పార్టీ లోకి తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోస్టుల భర్తీ ద్వారా పిసిసి బతోపేతమవుతున్నది.