Asianet News TeluguAsianet News Telugu

Top Stories : సాగర్ పై కేంద్ర బలగాలు, ‘కాప్ 33’ భారత్ లో.. ఈసారీ అధికారం మనదే.. ముంచుకొస్తున్న మిచాంగ్..

తెలంగాణలో ఆదివారం కౌంటింగ్, ఈసారీ మనదే అధికారం.. కంగారు వద్దన్న కేసీఆర్, అధికారం కోసం అర్రులు చాచడంలేదన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పై విరుచుకుపడనున్న మిచాంగ్ తుపాన్.. ఇలాంటి వార్తా కథనాల సమాహారం.. టాప్ టెన్ స్టోరీస్ ఇవి... 

Top Stories : Central forces on Nagarjunasagar, 'Cop 33' conference in India in 2028, Telangana counting predictions. Michang toofan- bsb
Author
First Published Dec 2, 2023, 7:40 AM IST

మూడో తేదీన సంబరాలు చేసుకుందాం... కెసిఆర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ.. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీలో కొంత గందరగోళానికి దారితీసాయి. దీంతో శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడం కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కెసిఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. ఈసారి మనమే గెలుస్తామని... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి కంగారు పడద్దని తెలిపారు. ప్రగతి భవన్ లో శుక్రవారం నాడు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ  సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న అనుకూల, ప్రతికూల పరిస్థితులను వారు ముఖ్యమంత్రికి వివరించారు. అన్నీ విన్న తర్వాత ముఖ్యమంత్రి ఫలితాలు వచ్చేవరకు కంగారు పడద్దని,  మూడో తేదీన  అందరం కలిసి సంబరాలు చేసుకుందామని.. ఈ సారి కూడా మన ప్రభుత్వం ఏర్పడుతుందని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు ఈనాడు ‘గాబరా పడొద్దు.. గెలిచేది మనమే’  అనే పేరుతో  బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

KCR : రెండు రోజులు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే - కేసీఆర్

2018తో పోలీస్తే  ఈసారి ఎంత శాతం పోలయ్యిందంటే…

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఈసారి గత ఏడాదితో పోలిస్తే  ఓటింగ్ తగ్గింది. గత ఏడాది కంటే 2.03 శాతం తక్కువగా నమోదైనట్లుగా తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో 73.37% మంది ఓటేశారు. కానీ ఈసారి ఓటింగ్ శాతం 71.34 కి పడిపోయింది. ఈ పర్సంటేజీకి పోస్టల్ బ్యాలెట్లను కలపాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,26,02,793 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,32,59,256  మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం జరిగిన పోలింగ్లో కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.  దీని తుది అంచనాలు వెలబడడానికి సమయం పట్టింది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది ఎక్కడా  రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల జాబితాను విడుదల చేసింది.  ఈ వార్తను ఈనాడు ‘నాటికంటే  నాసిగా’.. పేరుతో మెయిన్ పేజీలో ప్రచురించింది.

తెలంగాణలో మొత్తం 70.79 శాతం పోలింగ్ నమోదు.. 2018లోనే బెటర్, రీపోలింగ్‌ అక్కర్లేదు : వికాస్ రాజ్

ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడమే లక్ష్యం… కాప్ 28 సదస్సులో ప్రధాని.. 

యూఏఈ వేదికగా జరుగుతున్న కాప్ 28 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. దేశాధినేతల ఉన్నత స్థాయి సదస్సులో మాట్లాడారు. ఆయన అక్కడ మాట్లాడుతూ 2030 నాటికి వాతావరణంలో ఉన్న ఉధ్గారాల తీవ్రతను 45% తగ్గించడమే భారత్ లక్ష్యమని ప్రకటించారు. శిలాజయేతర ఇంధన వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. 2028లో జరిగే ‘కాప్ 33’ సదస్సును భారత్లో నిర్వహించాలని ప్రతిపాదించారు. భారత జనాభా ప్రపంచ జనాభాలో 17% ఉందని, కానీ కార్బన్ ఉధ్గారాలలో దేశం వాటా కేవలం నాలుగు శాతం మాత్రమే అని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వార్తా కథనాన్ని ఈనాడు ‘2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడమే భారత్ లక్ష్యం’ అనే పేరుతో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సంకల్పించుకోవాలి

ముగిసిన నాగార్జునసాగర్ వివాదం, కేంద్ర బలగాల ఆధీనంలోకి ప్రాజెక్ట్..

ఎట్టకేలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వివాదం  ఓ కొలిక్కి వచ్చినట్లు అయింది.  సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు  కృష్ణా బోర్డుకు అప్పగించారు. ఈ బాధ్యతలను కేంద్ర బలగాలకు, కృష్ణా  బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకారం దొరికింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ శుక్రవారం నాడు  నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళుతుందని ప్రకటించారు.  గత నెల 28వ తేదీ ముందున్న పరిస్థితినే కొనసాగించాలని ఆయన ఏపీని కోరారు.  డ్యామ్ నిర్వహణ తాత్కాలికంగా  సిఆర్పిఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు.  ఈ మేరకు శుక్రవారం రాత్రి వరకే కేంద్ర బలగాలు నాగార్జునసాగర్ కు చేరుకొని,  ప్రాజెక్టును తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.  దీనికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రముఖంగా  ప్రచురించింది.
.ముగిసిన నాగార్జున సాగర్ వివాదం

కుమార్తెకు అతిగా యాంటీబయాటిక్స్ ఇచ్చిన తండ్రి… ఏమయిందంటే.. 

సొంత వైద్యానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్తను ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురించింది. చిన్నచిన్న అనారోగ్యాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా,  ఏ టాబ్లెటో వేసుకోవడం అందరికీ అలవాటే. ఇలా ఓ తండ్రి  కుమార్తె అనారోగ్యానికి సొంత వైద్యం చేయడంతో ఆమెకు.. కిడ్నీలో రాళ్లు వచ్చాయి. పరిస్థితి విషమించింది.  దీంతో వైద్యులు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం నాడు ఈ విషయాన్ని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ లోని కన్సల్టెంట్ డాక్టర్ మీడియాకు తెలిపారు. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఓ యువతి అనారోగ్యానికి తరచూ గురవుతుండడంతో ఆమె తండ్రి..  ఇంటర్నెట్లో చూసి మందులిచ్చాడు. దీంతో పరిస్థితి విషమించిందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ‘సొంత వైద్యంతో ప్రాణం మీదికి..’ అనే పేరుతో ఈనాడు ప్రచురించింది.

మిచాంగ్ తో  జాగ్రత్త..  అధికారులను అప్రమత్తం చేసిన  జగన్…

ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమలపై మిచాంగ్ తుపాను విరుచుకు పడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ తుపాను కారణంగా  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని  సాక్షి.. ‘కోస్తాంధ్ర పై ‘మిచాంగ్’ తుపాను పడగ’ పేరుతో వార్తా కథనాన్ని ప్రచురించింది.

ఏపీ, తమిళనాడుకు తుఫాను ముప్పు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య…

ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ నేర్పించాలని, పాఠ్యప్రణాళికలో ఆర్థిక పాఠాలకు ప్రాధాన్యం ఇవ్వాలని  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  అన్నారు. ‘ఐబి’ బోధనా పద్ధతులపై వచ్చే ఏడాది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేలా విదేశీ భాషలు నేర్పించాలన్నారు. 2025-26లో ఒకటో తరగతి నుంచి ఐబీ ప్రారంభిస్తామని.. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతిలో దశలవారీగా దీన్ని అమల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు తర్ఫీదు నివ్వాలని జగన్ సూచించారు. దీనికి సంబంధించిన వార్తను  సాక్షి ‘ఐబి అడుగులు’ పేరుతో  బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

తెలంగాణ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగలేదు…

తెలంగాణలో గురువారం జరిగిన పోలింగ్లో రిగ్గింగ్ జరగలేదని ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ శాతానికి, ఇప్పుడు ప్రకటించిన పోలింగ్ శాతానికి తేడా ఉండడానికి కారణాలు తెలిపారు. రిగ్గింగ్ జరగలేదని కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో ఉన్న వారందరికీ  నిబంధన ప్రకారం ఓటేసే అవకాశం కల్పించామని… అందుకే సమయం పట్టిందని తెలిపారు. ఆ తర్వాత  ఈవీఎంలు, అధికారులు, ఇతర సామాగ్రి..రిసెప్షన్ కేంద్రాలకు చేరుకునేసరికి మరింత ఆలస్యమైందని చెప్పుకొచ్చారు.  దీనికి సంబంధించిన వార్తను  సాక్షి ‘రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవం’  అనే పేరుతో మెయిన్ పేజీలో ప్రచురించింది.

అధికారం కోసం ఎప్పుడూ అర్రులు చాచలేదు..  రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూను ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.  వారి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. తాను ఏనాడు అధికారం కోసం అర్హులు చాచలేదన్నారు. తన పోటీ కేవలం కేసీఆర్,  బండి సంజయ్ లాంటి వారితోనైనా అని చెప్పకు వచ్చారు.  ఈసారి ఎన్నికల్లో శాసనసభలో గెలిచి 80కి పైగా ఎమ్మెల్యేలతో  ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. కెసిఆర్ కి ఎక్స్పైరీ డేట్ ముగిసిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని.. ఆంధ్రజ్యోతి ‘ కేసీఆర్ ఫామ్ హౌస్ కు… కేటీఆర్ అమెరికాకు’ అనే హెడ్డింగ్ తో ప్రచురించింది.

మరోసారి సీఎం పదవిపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

కార్పొరేషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం టిఆర్ఎస్ వల్లే..  సిపిఐ నారాయణ

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన ఫైల్లు భద్రపరిచిన పరిపాలన విభాగంలో మంటలు అంటుకుని పూర్తిగా దగ్థమైంది.  హిమాయత్ నగర్- హైదర్గూడా రోడ్ లో ఉన్న సంస్థ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన సిపిఐ నేత నారాయణ ఇదంతా అధికార పార్టీ చేసిన పనే అని ఆరోపించారు. తాము చేసిన అవినీతి లెక్కలు బయటపడతాయని దగ్ధం చేశారన్నారు. దీనికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో…‘పర్యాటక కార్యాలయం బుగ్గిపాలు’ పేరుతో ప్రచురించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios