Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన నాగార్జున సాగర్ వివాదం : కేఆర్‌ఎంబీకి డ్యామ్‌ , సీఆర్‌ఫీఎఫ్ చేతికి భద్రత .. ఏపీ, టీఎస్ అంగీకారం

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదానికి చెక్ పడింది. నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్ధితిని కొనసాగించాలని ఇరు ప్రభుత్వం నిర్ణయించాయి.

end card between ap and telangana on Nagarjunasagar project dispute ksp
Author
First Published Dec 1, 2023, 6:20 PM IST | Last Updated Dec 1, 2023, 6:23 PM IST

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదానికి చెక్ పడింది. నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్ధితిని కొనసాగించాలని ఇరు ప్రభుత్వం నిర్ణయించాయి. అలాగే డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించాయి. దీనితో పాటు పాటు డ్యామ్ వద్ద భద్రత బాధ్యతను సీఆర్‌పీఎఫ్ దళాలకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు ఓకే చెప్పాయి. 

కాగా.. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరిగాయి. పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన 700మంది పోలీసులు డ్యాం మీదికి వచ్చారు. సాగర్ జలాల్లో తమ వాటా కోసం తెలంగాణ పోలీసులపై దాడికి దిగారు. వారి భూభాగంలో ఉన్న 13 గేట్లను ఆక్రమించుకున్నారు. ఆ తరువాత ఏపీ ఇరిగేషన్ అధికారులు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం అర్థరాత్రిమొదలైన ఈ ఉద్రిక్తతలు శుక్రవారానికీ కొనసాగుతున్నాయి. 

ALso Read: Nagarjuna sagar : కృష్ణా జలాలపై వివాదం ఇప్పుడే ఎందుకు?

ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అన్నిసార్లు ఈ జలాల పంపిణీ విషయంలో  గొడవలు వచ్చాయి. చాలాసార్లు తీవ్రస్థాయికి వెళ్లినప్పటికీ ఇప్పుడు కనిపించిన స్థాయిలో ఎప్పుడు  దూకుడు లేదు. మాటల యుద్ధం జరిగేది…  అధికారుల  స్థాయిలో పరిష్కారాలు జరిగేవి.  ఇంకా చెప్పాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్య ఒప్పందాల మేరకు  నడిచిపోతున్నట్లుగా కనిపించేది.

కానీ,  ఇప్పుడు సీన్ మారింది… తెలంగాణలో  పదెలుగా కొనసాగుతున్న ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడింది.  దీంతో  వచ్చే ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఉండడం కోసం..  ఈ వివాదాన్ని రెచ్చగొడుతున్నారనేది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.  ఇప్పటివరకు  ఇంత స్థాయిలో దూకుడు చూపించని ఆంధ్ర ప్రదేశ్… ఇప్పుడు ఎందుకు నాగార్జునసాగర్ డ్యాం పై ముళ్లకంచెలు వేసి,  13 గేట్లను స్వాధీనం చేసుకుంది?  కృష్ణా జలాల పంపిణీ  ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా  ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు  2000 క్యూసెక్కుల నీటిని ఎలా విడుదల చేసుకున్నారు?  రాష్ట్రంలో  రాబోయే  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  ఇరకాటంలో పెట్టి.. తెలంగాణ భవిష్యత్తును  గందరగోళంగా మార్చడానికేనా? ఏమో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అప్పటికి కానీ విషయాలు తేలవు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios