హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య  శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,00,611కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా సోకినవారిలో 2,176 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 1,72,388కి  చేరింది. ఇలా రికవరీ రేటు విషయంలో రాష్ట్రం(84.93శాతం) జాతీయస్థాయి(84.1శాతం) కంటే మెరుగ్గా వుంది. 

రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో బాధపడుతూ గత 24గంటల్లో 8మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1171కి చేరింది.  మరణాల రేటు విషయానికి వస్తే రాష్ట్రంలో 0.58శాతంగా వుంటే దేశంలో  ఇది 1.5శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

read more   మరో రికార్డుకు చేరువలో తెలంగాణ కరోనా కేసులు... తాజాగా బయటపడ్డ కేసులెన్నంటే

కరోనా కేసుల సంఖ్య తగ్గడమే కాదు టెస్టుల సంఖ్యను కూడా తగ్గించారు. గత 24గంటల్లో రాష్ట్రంలో కేవలం 36వేల శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేశారు. వీటితో కలిసి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన టెస్టుల సంఖ్య 32,41,597కి చేరింది. 

జిల్లాల వారిగా చూసుకుంటే ఎప్పటిలాగే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)పరిధిలోనే అత్యధికంగా 262 కేసులు బయటపడ్డాయి. ఇక కరీంనగర్ 83, మేడ్చల్ 91, నల్గొండ 72, రంగారెడ్డి 137, సంగారెడ్డి 69 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 50కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

కరోనా బులెటిన్: