హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య  రోజురోజుకు పెరుగుతూనే వుంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,949 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య విషయంలో తెలంగాణ మరో రికార్డుకుచేరువయ్యింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,99,26గా నమోదయి రెండు లక్షలకు చేరువయ్యాయి. 

ఇక ఇప్పటికే కరోనా సోకినవారిలో 2,366మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 1,70,212కు చేరింది. రాష్ట్ర రికవరీ రేటు 85.41శాతంగా వుండగా దేశ రికవరీ రేటు 84.1శాతంగా వుంది. ఇక కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.58 శాతంగా నమోదవగా జాతీయస్థాయిన అది 1.6శాతంగా వున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటన ద్వారా తెలుస్తోంది. 

read more  తెలంగాణలో కరోనా ఉధృతి: 2 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 27,901 పాజిటివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లోనే 51,623 కరోనా నిర్దారణ పరీక్షలు చేసినట్లు కరోనా బులెటిన్ ద్వారా తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతోంది.

జిల్లాల వారిగా చూస్తే ఎప్పటిలాగే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో 291 కేసులు బయటపడ్డాయి.  భద్రాద్రి కొత్తగూడెం 71, కరీంనగర్ 114, ఖమ్మం 85, మేడ్చల్ 150, నల్గొండ 124, నిజామాబాద్ 66, సిరిసిల్ల 55, రంగారెడ్డి 156, సిద్దిపేట 6, సూర్యాపేట 65, వరంగలం అర్బన్ 63 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 50కి తక్కువగానే కేసులు బయటపడ్డాయి.

పూర్తి వివరాలు: