హైదరాబాద్: పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ చెప్పారు.బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ చెప్పారు.ఆర్ధిక మాంధ్యం ఉన్న నేపథ్యంలో తాము 30 నెలలుగా మిన్నకున్నామన్నారు.

also read:7.5 శాతం ఫిట్‌మెంట్ కు పీఆర్సీ కమిటీ సిఫారసు: కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్టంగా రూ. 1.62 లక్షలు

పీఆర్సీ నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఆయన ఆరోపించారు. త్రీమెన్ కమిటీతో చర్చలకు వెళ్లి తమ డిమాండ్లను  వారి ముందుంచుతామన్నారు. తమకు 63 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతామన్నారు.  పీఆర్సీ కమిటీ నివేదిక ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.  త్రీమెన్ కమిటీ ఉంటే  కమిటీ నివేదిక త్వరగా వస్తోందని భావించామన్నారు. కానీ ఈ కమిటీ నిర్ణయం ఉద్యోగులకు ఎలాంటి న్యాయం చేసేదిగా లేదన్నారు.

ఇంతకంటే గొప్పగా  నివేదిక తయారు సత్తా తమ ఉద్యోగుల్లో ఉందన్నారు. ధరల పెరుగుదల ఆధారంగా  పీఆర్సీ కమిటీ  నివేదిక ఉండాలన్నారు.